AP News: పెను విషాదం నింపిన వాటర్ హీటర్.. తల్లితో పాటు ఇద్దరు పిల్లలకు షాక్.. అసలేమైందంటే? ఏపీలోని తాడిపత్రి పట్టణంలో విషాదం నెలకొంది. వాటర్ హీటర్ ఓ చిన్నారి ప్రాణం తీసింది. ఓ తల్లి తన ఇద్దరు కూతుళ్లకు స్నానం చేయిస్తుండగా.. పొరపాటున హీటర్ తగలడంతో వారంతా షాక్ కు గురయ్యారు ఈ ఘటనలో తల్లి, ఒక కుమార్తెకు తీవ్ర గాయాలు కాగా.. మరో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. By Bhoomi 06 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ అనంతపురం New Update షేర్ చేయండి వాటర్ హీటర్లు వాడేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణాలమీదకే వస్తుంది. తాజాగా బాత్రూమ్ లో విద్యుత్ హీటర్ తాగడంతో తల్లీ, ఇద్దరు కూతుళ్లకు షాక్ తగిలింది. ఈ ఘటనలో ఓ చిన్నారి మరణించగా...తల్లీ, కుమార్తెకు గాయాలయ్యాయి. ఈ ఘటన తాడిపత్రి అంబేద్కర్ నగర్ లో జరిగింది. పట్టణంలోని బస్టాండు సమీపంలో నివాసం ఉంటున్న వెంకటరాముడు బెల్దారిగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతనికి భార్య వాలంటీర్ గా పనిచేస్తుంది. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. నాగజ్యోతి ఇద్దరు కూతుళ్లకు స్నానం చేయించేందుకు బాత్రూంలోకి తీసుకెళ్లింది. అప్పటికే బాత్రూమ్ బకెట్లో హీటర్ పెట్టి ఉంచింది. ఈ వాటర్ హీటర్ ను చిన్నారి తాకడంతో ముగ్గురికి కరెంట్ షాక్ తగిలింది. దీంతో అపస్మారకస్థితి వెళ్లారు. బాత్రూంలోకి వెళ్లినవారు ఎంతకూ బయటకు రాకపోవడం..కేకలు వేసినా పలకపోవడంతో..అనుమానం వచ్చిన వెంకటరాముడు స్థానికుల సాయతో డోర్లు పగులకొట్టారు. బాత్రూంలో పడి ఉన్న ముగ్గురిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ముగ్గురిని పరీక్షించిన వైద్యులు విహన్యశ్రీ మరణించినట్లు నిర్దారించారు. అపస్మారకస్థితిలో ఉన్న నాగజ్యోతిని మెరుగైన వైద్యం కోసం పట్టణంలోకి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చిన్న కుమార్తె జ్యేష్టశ్రీ స్వల్పగాయాలతో బయటపడింది. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. వాటర్ హీటర్ తో జాగ్రత్త! కాగా.. వాటర్ హీటర్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ప్లగ్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. లేదంటే షాక్ కొడుతుంది. వాటర్ హీటర్ ను ఎప్పుడూ కూడా బాత్రూమ్ లో పెట్టకూడదు. ఎందుకంటే అక్కడంతా తడి, తేమా ఉంటుంది. తడి ఎక్కువగా ఉంటే షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది. బకెట్లో నీరు వేడయ్యాయో లేదో తెలుసుకోవాలంటే నీటిలో వేలు పెట్టకూడదు. స్వచ స్విచ్ ఆఫ్ చేసి హీటర్ ను పక్కను పెట్టిన తర్వాత అందులో చేయి పెట్టాలి. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత హీటర్ ను వాటర్ లో నుంచి తీసి చల్లని నీళ్లలో పెట్టాలి. ఎందుకంటే హీటర్ వేడిగా ఉంటుంది.. పక్కన పెడితే పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే వాటర్ హీటర్ వాడేవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. ఆ శాఖలో 6 వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్! #ap-news #water-heeter-shock మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి