Suryapet: తెలంగాణలో దారుణం.. 9వ తరగతి బాలికను గర్భవతిని చేసి..!

సూర్యపేట జిల్లాలో మరో కామాంధుడు రెచ్చిపోయాడు. మోతె మండలంలోని ఓ తండాకు చెందిన 9వ తరగతి చదువుతున్న 14ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనారోగ్యంపాలైన అమ్మాయిని ఆస్పత్రికి తీసుకెళ్లగా 3నెలల గర్భావతిగా వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

New Update
Rape Case: తిరుపతిలో దారుణం.. 6 ఏళ్ల బాలికను 65 ఏళ్ల వృద్దుడు ఏం చేశాడంటే!

Suryapet: తెలంగాణలో మరో కామాంధుడు రెచ్చిపోయాడు. అభం శుభం తెలియని పసిపాపపై ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. పట్టుమని 15ఏళ్లు కూడా దాటని అమ్మాయిని నమ్మించి క్రూరమృగంలా లైంగిక దాడి చేశాడు. అంతటితో ఆగకుండా ఆ బాలికను భయాందోళనకు గురి చేసి లోబరుచుకుని పలుమార్లు కామావాంఛ తీర్చుకున్నాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. సూర్యపేట జిల్లాలో జరిగిన ఈ దారుణమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇది కూడా చదవండి: AP Inter Results: ఏపీ ఇంటర్ ఫలితాలు.. ఈ లింక్ తో మీ రిజల్ట్స్!

3 నెలల గర్భావతి..
ఈ మేరకు మోతె మండలానికి చెందిన ఎస్ఐ యాదవేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మోతె మండల పరిధిలోని ఓ తండాలో ఈ దారుణం జరిగినట్లు తెలిపారు. 14 ఏళ్ల బాలికను అదే తండాకు చెందిన యువకుడు ప్రేమ పేరుతో నమ్మించి, తర్వాత పెళ్లి కూడా చేసుకుంటానని లోబరుచుకున్నాడు. ఈ క్రమంలోనే పలుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే కొన్ని రోజులుగా అనారోగ్యం పాలైన బాలికను తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించగా అసలు విషయం బయటపడింది. ఆ బాలిక 3 నెలలు గర్భం దాల్చినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన పేరెంట్స్ వెంటనే పోలీసులను ఆశ్రయించి తీవ్ర ఆందోళన చెందారు. తమకు న్యాయం చేయాలని కోరారు. దీంతో కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యాదవేందర్ తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు