Madhya Pradesh: రూ. 80 లక్షల విలువ చేసే వజ్రం సొంతం చేసుకున్న కార్మికుడు

మధ్యప్రదేశ్‌లోని పన్నాలో రాజు గౌడ్ అనే వ్యక్తికి 19.22 క్యారెట్‌ వజ్రం దొరికింది.ప్రభుత్వ వేలంలో దీని ధర రూ.80 లక్షలు, అంతకన్నా ఎక్కువే రావొచ్చని అధికారులు పేర్కొన్నారు.కార్మికుడు రాజు మీడియాతో మాట్లాడుతూ.. ఇంతటి అదృష్టం వరిస్తుందని కలలో కూడా అనుకోలేదని వివరించాడు.

New Update
Madhya Pradesh: రూ. 80 లక్షల విలువ చేసే వజ్రం సొంతం చేసుకున్న కార్మికుడు

Madhya Pradesh: అదృష్టం ఎప్పుడు ఎవరికీ ఏ రూపంలో వరిస్తుందో చెప్పలేమని నానుడి. ఎన్నో సంవత్సరాల నుంచి తనకి అదృష్టం కలిసి వస్తుందేమోనని ఎదురు చూస్తున్న ఓ కూలీకి రాత్రికి రాత్రే అదృష్టం తలుపు తట్టింది.కూలీ పనులు చేసుకుని బతికే అతడికి.. లీజుకు తీసుకున్న పొలంలో రూ.80 లక్షలు విలువచేసే వజ్రం లభించింది. దేశంలో వజ్రాలకు ప్రసిద్ధి గాంచిన మధ్యప్రదేశ్‌లోని పన్నాలో రాజు గౌడ్ అనే వ్యక్తికి 19.22 క్యారెట్‌ వజ్రం దొరికింది.

దీంతో అతడి కుటుంబం పట్టరాని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రభుత్వ వేలంలో దీని ధర రూ.80 లక్షలు, అంతకన్నా ఎక్కువే రావొచ్చని అధికారులు పేర్కొన్నారు. దీనిపై కార్మికుడు రాజు మీడియాతో మాట్లాడుతూ.. ఇంతటి అదృష్టం వరిస్తుందని కలలో కూడా అనుకోలేదని వివరించాడు. వజ్రం అమ్మిన తర్వాత వచ్చే డబ్బుతో తన ఆర్ధిక కష్టాలు గట్టెక్కుతాయని నమ్మకంగా ఉందని వివరించాడు. పిల్లల చదువులు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతాయని సంతోషం వ్యక్తం చేశాడు.

కృష్ణకళ్యాణ్‌పుర్‌లో లీజుకు తీసుకున్న గనిలో ఈ వజ్రం దొరకడం ఎంతో ఆనందంగా ఉందని, వెంటనే దీన్ని పన్నా డైమండ్ ఆఫీసులో జమ చేసినట్లు పేర్కొన్నాడు. గత పదేళ్లుగా వర్షాకాలంలో తాను వజ్రాల కోసం వెతుకుతూనే ఉన్నానని, ఇన్నాళ్లకు తనను అదృష్టం వరించిందన్నారు.తాను గతంలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేశానని, ప్రస్తుతం కుటుంబ పోషణకు కూలి పనులు చేస్తున్నట్టు వెల్లడించాడు. గత పదేళ్లుగా వర్షాకాలంలో చిన్న గనిని లీజుకు తీసుకుని వజ్రాల కోసం వెదుకుతున్నానని తెలిపాడు. ప్రస్తుతం వజ్రం దొరికిన గనిని రెండు నెలల కిందటే లీజుకు తీసుకున్నట్టు తెలిపాడు.

Also read: భారత్‌ లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు…తమ పౌరులకు అమెరికా హెచ్చరికలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు