స్కూల్ పిల్లల ప్రాణాలతో చెలగాటం.. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి చిన్నారి మృతి..! బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలిగొంది. హైదరాబాద్ బాచుపల్లి పీఎస్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8ఏళ్ల చిన్నారి దీక్షిత మృతి చెందింది. భాష్యం స్కూల్‌కి చెందిన బస్సు స్కూటీపై తన తండ్రితో కలిసి వెళ్తున్న దీక్షితను ఢీకొట్టింది. అటు మహబూబాబాద్ జిల్లాలోనూ మరో రోడ్డు ప్రమాదం జరిగింది. బొడ్లాడ శివారులోని పొలాల్లోకి ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 8మందికి విద్యార్థులకు స్వల్పంగా గాయాలయ్యాయి. By Trinath 02 Aug 2023 in హైదరాబాద్ New Update షేర్ చేయండి స్కూల్ బస్ డ్రైవర్ల నిర్లక్ష్యంపై చర్చ ఈనాటికి కాదు. దేశంలో నిత్యం ఏదో ఒక చోట స్కూల్ బస్సుల ప్రమాదాలపై ఏదో ఒక వార్త కనిపిస్తూనే ఉంటుంది. తాజాగా తెలంగాణ(Telangana)లో ఈ ఒక్క రోజే(ఆగస్టు 2) రెండు బస్సు ప్రమాద ఘటనలు వెలుగుచూడడం కలకలం రేపింది. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా బాచుపల్లి(bachupally)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8ఏళ్ల చిన్నారి చనిపోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది. స్కూటీపై తన తండ్రితో కలిసి స్కూల్‌కి వెళ్తున్న దీక్షితను భాష్యం స్కూల్‌కి చెందిన బస్సు ఢీకొట్టింది. స్కూటీ వెనకసీటులో కూర్చున్న దీక్షిత(deekshitha) వెంటనే కిందపడిపోయింది. అప్పుడు కూడా బస్సు డ్రైవర్ బ్రేక్ కొట్టలేదు. దీంతో బస్సు పాపపై నుంచి వెళ్లిపోవడంతో బాడీ మొత్తం నుజ్జునుజ్జయింది. బస్సు డ్రైవర్(bus driver)ని రహీంగా గుర్తించారు పోలీసులు. అతను నిర్లక్ష్యంగా నడపడం వల్లనే దీక్షిత చనిపోయిందని చెబుతున్నారు. అతివేగం వద్దు: మరోవైపు మహబూబాబాద్ జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. తొర్రూరు రెవిన్యూ డివిజన్ కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన బస్సు..దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామం నుంచి విద్యార్థులతో బయలుదేరింది. పెద్ద ముప్పారం, కుమ్మరికుంట్ల, దంతాలపల్లి గ్రామాలకు చెందిన సుమారు 42 మంది విద్యార్థులతో బొడ్లాడకు వెళ్తోంది. అక్కడ మరో 8 మంది విద్యార్థులు బస్సులో ఎక్కాల్సి ఉంది. ఐతే బొడ్లాడ శివారులోకి చేరుకోగానే అదుపుతప్పి రోడ్డు పక్కనున్న పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఐతే బస్సు ఎడమ వైపునకు వెళ్లాల్సింది పోయి కుడి వైపునకు వెళ్లడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చెప్పినా వినలేదు: బస్సు స్పీడ్‌గా వెళ్తుండటంతో వేగం తగ్గించాలని విద్యార్థులు చెప్పినప్పటికీ.. డ్రైవర్ పట్టించుకోలేదని సమాచారం. ఈ ప్రమాదంలో సుమారు పదిమంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. గతంలోనూ బస్సును అతివేగంగా నడుపుతున్నాడంటూ విద్యార్థుల తల్లిదండ్రులు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వల్ప గాయాలైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ఏం చెప్పాలి వీళ్లకి? బుడిబుడి అడుగులు వేసుకుంటూ పొద్దుపొద్దునే స్కూల్ బస్సు ఎక్కుతూ ఇంట్లో మమ్మీకి టాటా చెబుతూ బడికి వెళ్తుంటారు చిన్నారులు. స్కూల్ బస్సు వచ్చే టైమ్‌కే పిల్లలు రెడీగా ఉంటారు. అయినా కూడా డ్రైవర్ల తీరు మారదు. అందరూ ఇలానే నిర్లక్ష్యంగా ఉంటారని కాదు కానీ.. కొంతమంది మాత్రం చాలా నెగ్లిజెన్స్‌గా ఉంటారు. వాంటెడ్‌గా తప్పులు చేస్తుంటారు.. కావాలని బస్సును అతివేగంతో నడుపుతుంటారు. ఆ చిన్నారుల గురించి ఏ మాత్రం పట్టించుకోరు.. 'బస్సు స్లోగా పానియండి అంకూల్' అని పిల్లలు చెప్పినా వినిపించుకోరు. కొంతమంది డ్రైవర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి బస్సులోని చిన్నారుల ప్రాణాలు కాపాడుతుంటే.. మరికొందరు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పిల్లల ప్రాణాలను బలిగొంటున్నారు. #school-bus-accident మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి