ఐదేళ్లలో 633 మంది భారతీయ విద్యార్థులు మృతి: కేంద్రం! గత ఐదేళ్లలో విదేశాలకు చదువుకోవటానికి వెళ్లిన 633 మంది భారతీయ విద్యార్థులు మరణించినట్టు కేంద్రం వెల్లడించింది. కెనడాలో అత్యధికంగా 172 మంది విద్యార్థులు మరణించినట్టు కేంద్రం పేర్కొంది. విద్యార్థుల భద్రత పై ఆయా దేశాలతో సంప్రదింపులు జరుపినట్టు కేంద్రం తెలిపింది. By Durga Rao 28 Jul 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి గత ఐదేళ్లలో విదేశాలకు చదువుకునేందుకు వెళ్లిన 633 మంది విద్యార్థులు మరణించారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కెనడాలో అత్యధికంగా 172 మంది విద్యార్థులు మరణించారు. దీనికి సంబంధించి, కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వరదన్ సింగ్ లోక్‌సభలో వెల్లడించారు. విదేశాలలో చదువుకోవడానికి వెళ్లిన 633 మంది భారతీయ విద్యార్థులు గత ఐదేళ్లలో వివిధ ఘటనలో మరణించారని ఆయన తెలిపారు. కెనడాలో 172, అమెరికాలో 109, బ్రిటన్‌లో 58, ఆస్ట్రేలియాలో 57, రష్యాలో 37, ఉక్రెయిన్‌లో 18, జర్మనీలో 24, జార్జియా, కిర్గిజిస్తాన్, సైప్రస్‌లో 12, చైనాలో 8 మంది చనిపోయారు. ఆయా దేశాలలో ఇతరుల దాడిలో చనిపోయిన వారి సంఖ్య తక్కవని ఆయన తెలిపారు. మూడేళ్లలో 48 మంది విద్యార్థులను అమెరికా నుంచి బహిష్కరించబడ్డారని. వారిని ఎందుకు పంపించారో అమెరికా అధికారులు ఎలాంటి కారణాలను వెల్లడించలేదని ఆయన పేర్కొన్నారు. విదేశాల్లో ఉంటున్న భారతీయ విద్యార్థులకు భద్రత కల్పించేందుకు కేంద్రం చర్యలు చేపట్టిందని వెల్లడించారు. #central-government మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి