Manipur: మణిపూర్‌లో మళ్ళీ చెలరేగిన హింస..ఆరుగురు మృతి మణిపూర్‌లో మళ్ళీ హింస చెలరేగింది. ఆ రాష్ట్రంలోని జిరిబామ్ జిల్లాలో ఈరోజు కుకీ తిరుగుబాటు దారులు జరిపిన దాడుల్లో ఆరుగురు మరణించారు. దాంతో పాటూ తీవ్రవాదులు రెండు బంకర్లను కూడా ధ్వంసం చేశారు. By Manogna alamuru 07 Sep 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Manipur Violence: మణిపూర్‌లో కుకీ ఉగ్రవాదులు మళ్ళీ దాడులకు తెగబడ్డారు. రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు 229 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లాలోని నుంగ్‌చప్పి గ్రామంపై దాడి చేశారు. యురెంబమ్ కులేంద్ర సింఘా అనే 63 ఏళ్ల వ్యక్తిని చంపారు. దాని తరువాత మైతీ కమ్యూనిటీకి చెందిన సాయుధ గ్రూపులు, కుకీ ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో ఐదుగురు మరణించారు. ఈ కాల్పులు గురించి సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఎదురు కాల్పులు చేశారు. ఉగ్రవాదులు చేస్తున్న దాడులను అదుపులోకి తీసుకువచ్చారు. కుకీ ఉగ్రవాదులు నిన్నటి నుంచి దాడులు చేస్తున్నారు అని ఇంఫాల్ పోలీసులు చెప్పారు. బిష్ణుపూర్, చురాచంద్‌పూర్ సరిహద్దు ప్రాతాలతో పాటూ మరి కొన్ని ప్రదేశాల్లో దాడులు చేశారు. ఈ నేపథ్యంలో తీవరవాదులు అంతకు ముందు ఆక్రమించుకున్న రెండు బంకర్లను పోలీసులు ధ్వంసం చేశారు. జిరిబామ్‌లో భద్రతా కమాండర్‌లతో మైతీ, హ్మార్ నాయకులు సమావేశం అయ్యారు. శాంతి స్థాపనకు ప్రయత్నిస్తామని చెప్పారు. అయితే కుకీ గ్రూపులు మాత్రం దీన్ని వ్యతిరేకించాయి. అందులో భాగానే ఈరోజు దాడులు జరిపాయి. Also Read: Telangana: మున్నేరుకు వరద ముప్పు..ఖమ్మంకు డిప్యూటీ సీఎం #manipur #voilence #kuki-community మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి