North East Express: ఘోర రైలు ప్రమాదం, పట్టాలు తప్పిన నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్, 6గురు మృతి..పలువురికి తీవ్ర గాయాలు..!!

బీహార్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. న్యూఢిల్లీ నుంచి గౌహతి వెళ్తున్న ఆనంద్ విహార్ కామాఖ్య నార్ ఈస్ట్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. రైలులోని ఆరు బోగిలు కిందపడిపోయాయి. వీటిలో మూడు బోగీలు పూర్తిగా బోల్తాపడ్డాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు మరణించారు. వందకు పైగా ప్రయాణికులకు గాయాలయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

New Update
North East Express:  ఘోర రైలు ప్రమాదం, పట్టాలు తప్పిన నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్, 6గురు మృతి..పలువురికి తీవ్ర గాయాలు..!!

బీహార్‌లోని బక్సర్‌లోని రఘునాథ్‌పూర్ స్టేషన్‌లో బుధవారం రాత్రి రైలు ప్రమాదానికి గురైంది. ఈ రైలు ఆనంద్‌ విహార్‌ నుంచి వస్తున్నట్లు సమాచారం. ఆనంద్ విహార్ కామాఖ్య నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఆరు బోగీలు పట్టాలు తప్పాయి .సమాచారం ప్రకారం, ఆనంద్ విహార్ కామాఖ్య నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. రైలు ప్రమాదంలో ఆరుగురు మరణించగా, దాదాపు 100 మంది గాయపడినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన తర్వాత రైల్వే అధికారులు, రైల్వే సిబ్బంది ప్రత్యేక రైలులో చిక్కుకుపోయిన ప్రయాణికులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.

రఘునాథ్‌పూర్‌ నుంచి దానాపూర్‌ వరకు పలు రౌండ్లలో రైళ్లను నడుపుతున్నారు. ప్రమాద రైలు నుండి ప్రయాణికులందరినీ మెమో రైలులో అరా స్టేషన్‌కు తీసుకువెళతారు. అనంతరం అక్కడి నుంచి దానాపూర్‌కు తీసుకొచ్చి అక్కడి నుంచి ప్రయాణికులను మరో రైలులో ఎక్కించి గమ్యస్థానానికి పంపిస్తారు. రైల్వేశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. వీలైనంత త్వరగా ట్రాక్‌ను మరమ్మతులు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

కాగా ఘటనాస్థలానికి చేరుకున్న రెస్య్కూటీం, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఇందులో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం తర్వాత డౌన్ లైన్లో ప్రయాణించే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా రైలు ప్రమాదం నేపథ్యంలో రైల్వే శాఖ హెల్ప్ లైన్లను నెంబర్స్ ను ఏర్పాటు చేసింది.

పట్నా - 9771449971
ధన్ పూర్ - 8905697493
ఆరా - 8306182542
కమాండ్ కంట్రో - 7759070004

ఈ ఘటనపై బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తంచేశారు. క్షతగాత్రులను ఆదుకునేందుకు 15 అంబులెన్స్‌లు, వైద్య బృందాన్ని ఎస్‌డిఎంతో పాటు పంపినట్లు అర్రా డిఎం తెలిపారు. పరిపాలన ద్వారా పాట్నా నుండి డజను అంబులెన్స్‌లను కూడా పంపించారు. పాట్నాలోని PMCH, NMCH , IGIMSలను అప్రమత్తం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు