ఐదేళ్ల బాలికపై అఘాయిత్యం.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు

ఐదేళ్ల బాలికకు మద్యం తాగించి రేప్ చేసి చంపిన నరరూప రాక్షసుడు 'అస్ఫాక్‌ ఆలం'కు కేరళ హైకోర్టు మరణ దండన విధించింది. అయిదు యావజ్జీవ కారాగార శిక్షలు అనుభవించడంతో పాటు రూ.7.3 లక్షల జరిమానా కూడా చెల్లించాలని మంగళవారం తీర్పు వెల్లడించింది.

New Update
ఐదేళ్ల బాలికపై అఘాయిత్యం.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు

Kerala High Court: ఈ యేడాది జులై 28న బిహారీ వలస కార్మికుడు అస్ఫాక్‌ ఆలం(28).. ఓ అయిదేళ్ల చిన్నారికి మద్యం తాగించి రేప్ చేసిన ఘటన కేరళలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈ కేసుపై కేరళ హైకోర్టు ఫైనల్ తీర్పు వెల్లడించింది. బాలికకు తినుబండారాల ఆశచూపి తీసుకెళ్లి అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడిన నరరూప రాక్షసుడికి తగిన శిక్ష విధించింది. ఇలాంటి నేరగాళ్లను వదిలేస్తే భవిష్యత్తు తరాలకు ప్రమాదమని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. అతడు 5 యావజ్జీవ కారాగార శిక్షలు అనుభవించడంతో పాటు దాదాపు 8 లక్షల జరిమానా కూడా చెల్లించాలని స్పష్టం చేసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళలోని అలువా ప్రాంతంలో తనతో పాటు అదే భవనంలో నివసిస్తున్న తోటి బిహారీ వలస కుటుంబానికి చెందిన అయిదేళ్ల బాలికకు మిఠాయిలు కొనిపెడతానని చెప్పి బయటకు తీసుకెళ్లాడు ఆలం (Asfaq Alam). ఈ క్రమంలోనే దారిలో ఎదురైన వ్యక్తి ప్రశ్నించగా తాను ఆ బాలిక తండ్రినని నమ్మించాడు. ఈ క్రమంలోనే ముందుగా మామిడి పండ్ల రసం తాగిస్తూ పాపను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత బాలికకు మద్యం తాగించి పదేపదే అత్యాచారం చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఆ బాలిక దుస్తులనే మెడకు బిగించి హతమార్చాడు. డెడ్ బాడీపై చెత్త వేసి గ్రానైట్‌ ముక్కల కింద పూడ్చిపెట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

Also read :ఇష్టంలేదని చెప్పినా వినని ప్రేమోన్మాది.. తట్టుకోలేక ఆ అమ్మాయి ఏం చేసిందంటే

అయితే ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్న కేరళ హైకోర్టు.. ఇలాంటి వాడిని విడిచిపెడితే మరెందరో మైనర్‌ బాలికలతో పాటు పుట్టబోయే ఆడశిశువులకూ ప్రమాదమని తెలిపింది. ఆలం వయసు, సామాజిక ఆర్థిక నేపథ్యం, విద్య, మానసిక స్థాయులను పరిగణనలోకి తీసుకుని శిక్ష తగ్గించాలనే డిఫెన్స్‌ న్యాయవాది వాదాన్ని హైకోర్టు తోసిపుచ్చింది. బాలలపై లైంగిక నేరాల కట్టడికి ఉద్దేశించిన పోక్సో చట్టం (POCSO Act), ఐపీసీ నిబంధనలను అనుసరించి ఆలంకు హైకోర్టు అయిదు యావజ్జీవ కారాగారాలతోపాటు ఒకటి నుంచి పదేళ్ల వరకు విడివిడిగా జైలు శిక్షలు విధించింది. దోషి తొలుత స్వల్పకాల జైలు శిక్షలు, ఆ తరవాత యావజ్జీవ కారాగార శిక్షను అనుభవించాలని కోర్టు స్పష్టం చేసింది. తీర్పును సవాలు చేసే అవకాశం ఆలంకు ఉన్నందున, ఆ అవకాశాన్ని అతడు ఉపయోగించుకున్న తరవాత ఉరిశిక్ష అమలు చేయాలని పేర్కొంది. గతంలోనూ 2018లో దిల్లీలో పదేళ్ల బాలికపై ఆలం లైంగిక దాడి చేసినందుకు నెలరోజులు జైలులో ఉండి బెయిలుపై విడుదలైన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది హైకోర్టు.

Advertisment
Advertisment
తాజా కథనాలు