Puri Jagannath Temple: కరోనా తర్వాత తెరుచుకున్న పూరీ జగన్నాథుని 4 ద్వారాలు ! ఒడిశాలోని పూరీ జగన్నాథ దేవాలయం కరోనా వైరస్ తర్వాత మొదటిసారిగా నాలుగు ద్వారాలను తెరిచి భక్తులను అనుమతించింది. గతంలో కరోన సమయంలో 3ద్వారాలను మూసివేయగా ఇప్పుడు తిరిగి సింహద్వారం, గుర్రపు ద్వారం, పులి ద్వారం, ఏనుగు ద్వారాలను అధికారులు తెరిచారు. By Durga Rao 13 Jun 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Puri Jagannath Temple 4 Doors Opened: ప్రపంచ ప్రసిద్ధి చెందిన పూరీ జగన్నాథ ఆలయానికి సింహద్వారం, గుర్రపు ద్వారం, పులి ద్వారం , ఏనుగు ద్వారాలను అధికారులు తెరిచారు. కానీ కరోనా సమయంలో మూడు ద్వారాలు మూసివేసి ఒక ద్వారం గుండానే భక్తుల అనుమతించారు.దీంతో ఎన్నికలముందు బీజేపీ అధికారంలోకి వస్తే నాలుగు గేట్లను మళ్లీ తెరుస్తామని హామీ ఇచ్చింది. ఆ విధంగా ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం తో మొత్తం నాలుగు ద్వారాలను తెరిచి భక్తులను అనుమతించింది. ముఖ్యమంత్రి మోహన్ సరన్ మాజీ తదితరులు ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. పూరీ జగన్నాథ ఆలయ నిర్వహణ కోసం ఒడిశా ప్రభుత్వం 500 కోట్ల రూపాయలను అందించాలని నిర్ణయించింది. Also Read: ఈ చిట్కాలను పాటించండి.. జూన్, జులై మొత్తం సంతోషంగా గడిచిపోతుంది! #puri-jagannath-temple మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి