/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/lift-jpg.webp)
గ్రేటర్ నోయిడాలోని నిర్మాణంలో ఉన్న భవంతిలోని శుక్రవారం లిఫ్ట్ కూలిపోవడంతో నలుగురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆమ్రపాలి బిల్డర్స్ నిర్మాణాన్ని చేపడుతున్న ఓ చోట ఈ ఘటన చోటు చేసుకుంది. బిస్రఖ్ పోలీసు స్టేషన్ పరిధిలోని గౌర్ సిటీలో ఈ నిర్మాణం చేపట్టారు.
లిఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలడంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా..మరో ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ కేసు గురించి దర్యాప్తు చేపట్టినట్లు జిల్లా మేజిస్ట్రేట్ మనీష్ శర్మ తెలిపారు.
ग्रेटर नोएडा में शुक्रवार को बड़ा हादसा हो गया. यहां निर्माणाधीन बिल्डिंग की लिफ्ट गिरने से चार लोगों की मौत हो गई. बताया जा रहा है कि निर्माणाधीन बिल्डिंग आम्रपाली ग्रुप की है. #Noida #Lift #Accident #News #ASDNews pic.twitter.com/5OI90EVPpr
— ASD News (@MediaAsd) September 15, 2023
updated soon