వరదలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు, భయాందోళనలో తల్లిదండ్రులు ఓ పక్క భారీ వర్షాలు, మరోపక్కా ఆకస్మిక వరదలతో ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం ఎల్లదీస్తున్నారు. వర్ష బీభత్సంతో మరణించిన వారి సంఖ్య 37కు చేరింది. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విద్యార్థులు కసోల్‌లో చిక్కుకున్నారు. వరదల్లో నలుగురు తెలుగు ఆర్కిటెక్ట్ విద్యార్థులు చిక్కుకున్నారు. నలుగురిలో ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉండగా వారి ఫోన్లు పనిచేయకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. By Shareef Pasha 11 Jul 2023 in నేషనల్ Scrolling New Update షేర్ చేయండి ఉత్తరాది రాష్ట్రాల్లోని యుమున నదితో పాటు ఇతర నదులు, వాగులు ఉధృతంగా పొంగిపొర్లుతున్నాయి. పలు పట్టణాలు, నగరాలు జలమయమయ్యాయి. సహాయ చర్యల కోసం అధికారులు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలతో పాటు ఆర్మీని రంగంలోకి దింపారు. హిమాచల్‌లో పరిస్థితి భయానక పరిస్థితులు నెలకొన్నాయి. వరద ఉధృతికి కొండచరియలు విరిగిపడి ఇళ్లు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల దుకాణాలు, వాహనాలు వరద ఉధృతిలో కొట్టుకుపోయాయి. పర్యాటక ప్రదేశమైన మనాలీలో చిక్కుకుపోయిన 29 మందిని ఎన్టీఆర్‌ఎఫ్, పోలీసులు కాపాడారు. ఇంకా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 400 మంది చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. ఓ ఇల్లు కూలిపోయి ఓ నేపాలీ కుటుంబానికి చెందిన ముగ్గురు కుటుంబసభ్యులు మృతి చెందారు. రాష్ట్రంలో గత 50 ఏళ్లలో ఇలాంటి కుంభవృష్టిని చూడలేదని హిమాచల్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడడంతో పలు మార్గాల్లో రాకపోకలు స్తంభించిపోయాయి. చార్‌ధామ్ యాత్ర కోసం వెళ్లిన వేలాది మంది భక్తులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి రాంబన్ వద్ద తీవ్రంగా దెబ్బతింది. దీంతో జమ్మూ నుంచి అమర్‌నాథ్ యాత్రను వరసగా మూడో రోజు కూడా నిలిపివేశారు. జమ్మూలో 6 వేల మందికి పైగా యాత్రికులు ఆగిపోయారు. భగవతి బేస్ క్యాంప్ దగ్గరే 5 వేల మందికి పైగా ఉన్నారు. పంజాబ్‌లో జల దిగ్బంధంలో చిక్కుకున్న ఓ యూనివర్సిటీ నుంచి 1000 మంది విద్యార్థులు, సిబ్బందిని ఆర్మీ సురక్షిత ప్రాంతానికి తరలించింది. హరియాణా హథినీకుండ్ బ్యారేజీ నుంచి మరింత నీటిని విడుదల చేయడంతో యుమున 204 మీటర్ల ప్రమాద మార్క్ దాటింది. అయితే అనేక ప్రాంతాల్లో రోడ్లపై మోకాలి లోతు వర్షపు నీరు నిలిచిపోయి ఉండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. రాజస్థాన్‌లో కుంభవృష్టితో జన జీవనం స్తంభించింది. సిరోహీ జిల్లాలోని మౌంట్ అబూలో 23.1 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. రాజధాని జైపూర్‌లో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. గుజరాత్‌లో రెండో రోజు భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో 8 గంటల వ్యవధిలో 10 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నదులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాష్ట్రవ్యాప్తంగా 37 రిజర్వాయర్లకు హై అలర్ట్ ప్రకటించారు. హిమాచల్, ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణాల్లో సహాయ చర్యల కోసం 39 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను పంపినట్టు అధికారులు తెలిపారు. వీరితో పాటు ఆయా రాష్ట్రాల్లో ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు వరదల్లో చిక్కుకున్న వారికి సేవలందిస్తున్నాయి. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి