Rape Case : బాలికను రేప్ చేసి.. ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి దారుణం!
యూపీలోని లఖింపూర్‌ఖేరీ జిల్లాలో దారుణం జరిగింది. మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలంటూ 22 ఏళ్ల యువకుడు వెంటపడి వేధించాడు. ఆమె తిరస్కరించడంతో లైంగిక దాడి చేసి బాలిక ముఖంపై ఇనుప రాడ్డుతో తనపేరు రాశాడు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
Crime : మరో కామాంధుడు(Lustful) రెచ్చిపోయాడు. అభం శుభం తెలియని బాలికను ప్రేమిస్తున్నానంటూ వెంటపడి చివరికి దారుణానికి పాల్పడ్డాడు. మైనర్ బాలిక(Minor Girl) ను మూడురోజులు బంధించి అత్యాచారం చేసిన దారుణమైన సంఘటన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ఖేరీ జిల్లాలో చోటు చేసుకుంది.
ఇనుప రాడ్డుతో బాలిక ముఖంపై పేరు..
ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లఖింపూర్‌ఖేరీ జిల్లా కేంద్రంలో స్థానికంగా ఉంటున్న అమన్(22) అనే యువకుడు పెళ్లి చేసుకుంటానని ఓ బాలిక వెంట పడ్డాడు. ఆమె తిరస్కరించడంతో ఆగ్రహానికి లోనైన నిందితుడు.. ఆమెను బంధించి లైంగిక వేధింపు(Sexual Assault) లకు పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా కాల్చిన ఇనుప రాడ్డుతో బాలిక ముఖంపై తన పేరు రాశాడు. చివరికి అతనిబారినుంచి తప్పించుకున్న బాలిక అపస్మారక స్థితిలో ఉండగా గమనించి స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నిందితుడిని అదుపులోకి తీసుకొని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Hyd Murder: 70 ఏళ్ల వృద్ధురాలిని చంపిన 17 ఏళ్ల బాలుడు.. డెడ్ బాడీపై డ్యాన్స్ చేస్తూ వీడియో తీసి!
హైదరాబాద్ కుషాయిగూడలో ఘోర మర్డర్ జరిగింది. షాపులో పనిచేసేందుకు వచ్చిన 17 ఏళ్ల బాలుడు 70 ఏళ్ల మహిళ యజమానిని దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత డెడ్ బాడీపై డ్యాన్స్ చేస్తూ తన ఫోన్‌లో వీడియో రికార్డ్ చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Hyd Murder: హైదరాబాద్ కుషాయిగూడ మర్డర్ కేసు సంచలనం రేపుతోంది. ఇంట్లో పనిచేసేందుకు వచ్చిన 17 ఏళ్ల బాలుడు 70 ఏళ్ల మహిళను అత్యంత దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత డెడ్ బాడీపై డ్యాన్స్ చేస్తూ తన ఫోన్‌లో వీడియో రికార్డ్ చేసిన ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. అయితే సోమవారం రాత్రి బెంగళూరులోని తన బంధువుతో తాను చేసిన నేరం గురించి చెప్పిన బాలుడు.. వీడియోను షేర్ చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఇనుప రాడుతో కొట్టి కొట్టి..
ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు రాజస్థాన్‌కు చెందిన కమలా దేవి (70) గత 30 ఏళ్ల క్రితం తన భర్తతో కలిసి జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చింది. కమలా భర్త 15 సంవత్సరాల క్రితం చనిపోయారు. దీంతో ఆమె కృష్ణ నగర్‌లోని 5వ వీధిలో ఉండే తమ ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. అయితే తన భర్త నడిపించిన దుకాణాలు ఇప్పుడు అద్దెకు ఇవ్వడంతో నెలకు దాదాపు 50 వేల రూపాయలు వస్తుంది. ఈ క్రమంలోనే ఆమె రోజువారీ పనుల కోసం దుకాణాలలో పనిచేసే కార్మికుల నుంచి సహాయం తీసుకునేది. ఇటీవల ఒక దుకాణంలో పనిచేసే 17 ఏళ్ల కార్మికుడితో గొడవ జరిగింది. దీంతో కమలపై పగ పెంచుకున్న 17 ఏళ్ల పిల్లవాడు ఏప్రిల్ 11న రాత్రి కమల ఇంటికి వెళ్లి 11.30 గంటలకు ఆమె తలపై ఇనుప రాడ్ తో దాడి చేసి హతమార్చాడు.
సీలింగ్ ఫ్యాన్ కు వేలాడదీసి..
ఆ తర్వాత చీరను ఆమెను గొంతుకు చుట్టి సీలింగ్ ఫ్యాన్ కు వేలాడదీశాడు. ఆమె శరీరం సగభాగం మంచంమీద ఉంచి మృదేహంపై డ్యాన్స్ చేస్తూ సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు. అనంతరం ఇంటికి తాళం వేసి పారిపోయాడు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 13న బెంగళూరులో నివసించే బాధితురాలి బంధువుకు నిందితుడు స్వయంగా ఫోన్ చేసి చెప్పడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడి హత్య వాదనలను ముందుగా ఆ బంధువు నమ్మలేదు. నిందితుడు అతను శరీరంపై నృత్యం చేస్తున్న వీడియోను షేర్ చేశాడంతో ఉలిక్కిపడ్డాడు.
ఏప్రిల్ 14న కుషాయిగూడలోని పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో వెంటనే ఇంటికి వెళ్లి చూడగా ఇంటి నుండి దుర్వాసన వచ్చింది. మా బృందం తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించగా కుళ్ళిపోయిన మృతదేహం కనిపించింది. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించామని కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్ ఎల్. భాస్కర్ రెడ్డి తెలిపారు. హత్య కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.