Wankhede : అలా జరిగివుంటే వన్డే వరల్డ్ కప్ కూడా మనమే కొట్టే వాళ్ళం భయ్యా.. ఇండియన్ ఫ్యాన్స్!

2023 ప్రపంచకప్‌ ఫైనల్‌ వాంఖడేలోనే జరిగి ఉంటే టీమిండియా కప్‌ సాధించేదని క్రికెట్ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. ముంబై సిటీ క్రికెట్‌కు అడ్డా. ప్రతి క్షణం ఆటగాళ్లకు మద్దతు ఉంటుంది. కానీ అహ్మదాబాద్‌ స్టేడియంలోని వాతావరణం మన ఆటగాళ్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిందని విశ్లేషిస్తున్నారు.

New Update
Wankhede : అలా జరిగివుంటే వన్డే వరల్డ్ కప్ కూడా మనమే కొట్టే వాళ్ళం భయ్యా.. ఇండియన్ ఫ్యాన్స్!

2003 World Cup : 'అరే మావా... లాస్ట్‌ ఇయర్‌ వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ వాంఖడే స్డేడియం (Wankhede Stadium) లో జరిగి ఉంటే ఎంత బాగుండేది మావా.. మనమే కప్‌ కొట్టేవాళ్లం..' ఇది దేశంలో సగటు క్రికెట్‌ అభిమాని అనుకుంటున్న మాటలు. 2024 టీ20 వరల్డ్‌కప్‌ (T20 World Cup 2024) గెలిచిన తర్వాత స్వదేశానికి వచ్చిన టీమిండియా (Team India) కు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ముంబై వీధులు త్రివర్ణ పతకాలతో రెపరెపలాడాయి. నారిమాన్‌ పాయింట్‌ నుంచి మెరైన్‌ డ్రైవ్‌ మీదగా వాంఖడే స్డేడియం వరకు సాగిన విక్టరీ పరేడ్‌కు ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. ఎందుకంటే ట్రేడిషినల్‌గా ముంబై సిటీ క్రికెట్‌కు అడ్డా.. అందుకే ఈ అభిమానం, ఉత్సాహం..!

హోమ్‌ అడ్వేంటజ్‌..
ఓసారి ఫ్లాష్‌బ్యాక్‌కు వెళ్దాం.. 2023 నవంబర్‌ 19న ఇండియా, ఆస్ట్రేలియా (Australia) వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో తలపడ్డాయి. అహ్మదాబాద్‌లోని మోదీ స్డేడియంలో ఈ మ్యాచ్‌ జరిగింది. అది ప్రపంచంలోనే అత్యధిక సిట్టింగ్‌ కెపాసిటీ ఉన్న స్టేడియం. దీంతో క్రౌడ్‌ కౌంట్‌ లక్షకు టచ్‌ అయ్యింది. అటు సినీ సెలబ్రెటీలు, మాజీ క్రికెటర్లతో పాటు ఏకంగా ప్రధాని మోదీ సైతం మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చారు. ఇంతటీ హోమ్‌ అడ్వేంటజ్‌ ఉన్న టీమిండియా నాడు ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై ఘోరంగా ఓడిపోవడం ఫ్యాన్స్‌ను తీవ్రంగా బాధపెట్టింది.

ఫ్యాన్స్‌ చాలా అప్‌సెట్‌..
నిజానికి ఏ జట్టుకైనా వరల్డ్‌కప్‌లో హోం కంట్రీలో ఆడుతుండడం అదనపు బలం. అయితే అహ్మదాబాద్‌ స్టేడియంలో ఫైనల్‌లో ఇండియా ఓడిపోయిన తర్వాత ఫ్యాన్స్‌ చాలా అప్‌సెట్‌ అయ్యారు. అటు స్టేడియంలో కూర్చొని మ్యాచ్‌ చూస్తున్న ఫ్యాన్స్‌ చాలా సమయం చప్పుడు చేయకుండా ఉండిపోయారు. ఇండియా వికెట్‌ పడుతున్న ప్రతీసారి, అటు ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ టైమ్‌లో కంగారూలు బౌండరీలు బాదుతున్న ప్రతీసారి స్టేడియం పిన్‌ డ్రాప్‌ సైలెన్స్‌ పాటించింది. ఇది భారత్‌ ఆటగాళ్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిందని క్రికెట్‌ ఫ్యాన్స్‌ అభిప్రాయపడ్డారు.

గొప్ప ఆటగాళ్లను ఇచ్చిన గడ్డ..
వాస్తవానికి ఇండియాలో ముంబై, కోల్‌కతాలల్లో క్రికెట్‌కు క్రేజ్‌ ఎక్కువగా ఉంటుంది. ఇక గవాస్కర్‌, సచిన్‌ నుంచి రోహిత్‌ శర్మ వరకు టీమిండియాకు ఎందరో గొప్ప ఆటగాళ్లను ఇచ్చిన గడ్డ ముంబై. అందుకే ఇంపార్టెంట్‌ మ్యాచ్‌లు ముంబై వాంఖడే స్టేడియంలో జరిగేవి. 2011 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ కూడా వాంఖడేలోనే జరిగింది. నాడు టీమిండియా శ్రీలంకపై ఘన విజయం సాధించింది. 1983 తర్వాత 28ఏళ్లకు టీమిండియా నాడు వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడింది.

స్టేడియమంతా వందేమాతరం సాంగ్‌..
2011 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో వాంఖడే క్రౌడ్‌ టీమిండియా ఆటగాళ్లకు క్షణక్షణం మద్దతుగా నిలిచింది. మ్యాచ్‌ బ్యాలెన్స్‌గా ఉన్న సమయంలో స్టేడియమంతా ఒక్కసారిగా వందేమాతరం సాంగ్‌ పాడడాన్ని అభిమానులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు. నిజానికి ఇండియా వికెట్‌ పడినప్పుడు స్టేడియం సైలెంట్‌ అవ్వడం సాధారణ విషయమే. అయితే వాంఖడే లేదా ఇతర క్రికెటింగ్‌ లవింగ్‌ సిటీలు మాత్రం అనునిత్యం ఆటగాళ్లను ఉత్తేజపరుస్తూనే ఉంటాయి. తమ జట్టు గెలవడం కోసం స్టేడియంలోనే ప్రార్థనాలు చేస్తుంటాయి. అయితే 2023 ప్రపంచకప్‌ ఫైనల్‌లో మాత్రం మ్యాచ్‌ ప్రారంభం నుంచే ఫ్యాన్స్‌ డీలా పడిపోయారని చెబుతుంటారు క్రికెట్‌ లవర్స్‌!

వాంఖడే స్టేడియంలో సంబరాలు..
ఇక వెస్టిండీస్‌ గడ్డపై టీ20 కప్‌ గెలుచుకున్న రోహిత్‌ సేన వాంఖడే స్టేడియంలో సంబరాలు చేసుకుంది. ఆటపాటలతో ప్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. దేశభక్తి గీతాలు ప్లే అవుతున్న ప్రతీసారి వాంఖడే స్టేడియంలోని అభిమానులతో పాటు టీమిండియా ఆటగాళ్లు సాంగ్స్‌ పాడారు. ఇదంతా 2011 వన్డే ప్రపంచకప్‌ గెలుపును గుర్తుచేసింది. నాడు టీమిండియా వరల్డ్‌కప్‌ సాధించిన తర్వాత భారత్‌ ఆటగాళ్లు సచిన్‌ను భూజాలపై ఎత్తుకోని స్టేడియమంతా తిప్పడాన్ని క్రికెట్‌ అభిమానులు మరోసారి గుర్తు చేసుకున్నారు. 2023 ప్రపంచకప్‌ ఫైనల్‌ కూడా వాంఖడేలోనే జరిగి ఉంటే టీమిండియా కప్‌ సాధించేదని అభిప్రాయపడుతున్నారు!

Also Read : హైదరాబాద్‌కు చేరుకున్న చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన పార్టీ శ్రేణులు

Advertisment
Advertisment
తాజా కథనాలు