AP: రామాలయ విగ్రహ ప్రతిష్టలో అపశృతి.. 200 మందికి ఫుడ్ పాయిజన్! అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. కుర్లపల్లి గ్రామంలో రామాలయ విగ్రహ ప్రతిష్టలో అపశృతి చోటుచేసుకుంది. విగ్రహ ప్రతిష్ట వేడుకలో భాగంగా ప్రజలకు ఉచిత భోజనాలు ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఈ ఆహారం తిన్న 200 మందికి ఫుడ్ పాయిజన్ అయింది. బాధితులు చికిత్స పొందుతున్నారు. By srinivas 12 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ అనంతపురం New Update షేర్ చేయండి Ananthapuram: అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. రాప్తాడు నియోజకవర్గం కుర్లపల్లి గ్రామంలో రామాలయ విగ్రహ ప్రతిష్ట అపశృతిలో చోటుచేసుకుంది. విగ్రహ ప్రతిష్ట వేడుకలో భాగంగా ప్రజలకు ఉచిత భోజనాలు ఏర్పాటు చేశారు నిర్వాహకులు. అయితే ఈ ఆహారం తిన్న 200 మందికి ఫుడ్ పాయిజన్ అయింది. ఎడతెరిపిలేని వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో బాధపడుతున్న వారందరినీ దగ్గరలోని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి, ఇతర ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించినట్లు స్థానికులు తెలిపారు. ఇది కూడా చదవండి: TS: రైతులను మోసం చేస్తే కఠిన చర్యలుంటాయి.. సీఎం రేవంత్ వార్నింగ్! అయితే ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డితోపాటు పరిటాల శ్రీరామ్ ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ప్రస్తుతం ఎవరికీ ప్రాణాపాయం లేదని, తొందరగానే కోలుకుంటారని వైద్యులు వెల్లడించినట్లు తెలిపారు. #anantapur-district #200-people-have-food-poisoning మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి