Heart Attack: 19 ఏళ్లకే ఆగిన గుండె..ఓ డిగ్రీ విద్యార్థి గుండెపోటుతో మృతి..!! 60 ఏళ్లకు వచ్చే గుండెజబ్బులు..20 ఏళ్లు నిండకముందే వస్తున్నాయి. పెద్దలనే కాదు చిన్నపిల్లలను కూడా బలితీసుకుంటున్నాయి. రాజన్న సిరిసిల్లా జిల్లాలోని పోతుగల్ గ్రామానికి చెందిన చందు (19) గుండెపోటుతో మరణించాడు. తెల్లవారుజామున బాత్రూంకు వెళ్లి గుండెపోటుతో అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. By Bhoomi 21 Feb 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి ఒక్కప్పుడు 60ఏళ్లు పైబడినవారికే గుండెజబ్బులు వచ్చేవి. కానీ ఇప్పుడు పుట్టిన పిల్లలను కూడా బలితీసుకుంటున్నాయి. తాజాగా ఓ డిగ్రీ విద్యార్థి గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రాజన్న సిరిసిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందిన రాజు లత దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో పెద్ద కొడుకు సిద్ధిపేటలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. చిన్న కొడుకు చందు 19ఏళ్లు హైదరాబాద్ లోని ఓ డిగ్రీ కాలేజీలో బీకాం చదువుతున్నాడు. అక్కడే ఓ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. అయితే చందుకు జ్వరం వచ్చింది. దీంతో మంగళవారం నాడు హైదరాబాద్ నుంచి పోతుగల్ తన స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున బాత్రూంకు వెళ్లిన చందు గుండెపోటుతో అక్కడిక్కడే మరణించాడు. చందూ మరణంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అందరితో కలిసిమెలిసి ఉండే తమ కొడుకు ఆకస్మికంగా మరణించడంతో గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఇది కూడా చదవండి: తెలంగాణలో మరో భారీ జాబ్ మేళా…65పైగా కంపెనీలు..5వేలకు పైగా ఉద్యోగాలు..!! #heart-attack #mustabad #cardiac-arrest #rajanna-district మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి