Loksabha Polls: ఒకే కుటుంబం..12,00మంది ఓటర్లు..ఆ ఇంటికి క్యూ కట్టిన అభ్యర్థులు.!

లోకసభ ఎన్నికల వేళ...నేపాలీ పామ్ గ్రామం దృష్టిని ఆకర్షిస్తుంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో గ్రామంలోని 300 కుటుంబాలు ఒకే వంశానికి చెందినవి. అస్సాంలోని తేజ్ పూర్ నియోజకవర్గంలో ఉన్న ఈ గ్రామం గురించి మరింత సమాచారం తెలుసుకోవాలటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

New Update
Loksabha Polls: ఒకే కుటుంబం..12,00మంది ఓటర్లు..ఆ ఇంటికి క్యూ కట్టిన అభ్యర్థులు.!

Loksabha Polls:  లోకసభ ఎన్నికల వేళ అస్సాంలోని తేజ్ పూర్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే నేపాలీ పామ్ గ్రామంలో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ప్రచారంలో భాగంగా స్థానిక అభ్యర్థులు ఈ పల్లెకు క్యూ కడుతున్నారు. కారణం ఏంటంటే ఈ గ్రామంలో నివసించే వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం. రాన్ బహదూర్ అనే గోర్ఖా ఇక్కడి సోనిత్ పూర్ జిల్లాలో స్ధిరపడ్డాడు. వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తుండేవారు. అతనికి ఐదుగురు భార్యలు. 12 మంది కొడుకులు. 10 మంది కూతురులు. ఆయన 1997లో మరణించాడు.

ఇప్పుడా ఆ కుటుంబంలో దాదాపు 2,500మంది సభ్యులు ఉన్నారు. వారిలో ఓటర్లు 12వందల మంది ఉన్నారు. వీరంతా కుటుంబ పెద్దలు ఎంచుకున్న అభ్యర్థికే ఓటు వేస్తామని ముందే నిర్ణయించుకుంటారు. దీంతో తేజ్ పూర్ నియోజకవర్గంలో పోటీ చేసే ప్రతి అభ్యర్థి ఈ గ్రామ పెద్దలతో ముఖ్యంగా రాన్ బహదూర్ థపా పెద్ద కుమారుడు ప్రస్తుతం గ్రామానికి అధిపతి టిల్ బహదూర్ థాపాతో మంచి సంబంధాలు కొనసాగించేందుకు ప్రయత్నిస్తుంటారు.

“మా నాన్న ఐదుసార్లు పెళ్లి చేసుకున్నారు, మేము 22 మంది పిల్లలం (12 మంది అబ్బాయిలు 10 మంది అమ్మాయిలు). మేమందరం ఒకే ఇంట్లో ఉండటం కష్టంగా మారడంతో..వేరువేరుగా ఉంటున్నాం.  మా కొడుకులు, మనవలకు కూడా పెళ్లిలు జరిగాయి.  ఈ గ్రామంలో ఇప్పుడు 300 కుటుంబాలు ఉన్నాం. ఈ నేపాలీ పామ్ గ్రామంలో ఇతర కుటుంబాలు లేవు . మాకు 65 మంది మనవళ్లు, 70 మంది మనవరాళ్లు ఉన్నారు, ”అని రాన్ బహదూర్ థాపాపెద్ద కుమారుడు,ఇప్పుడు గ్రామ పెద్ద టిల్ బహదూర్ థాపా చెప్పారు, కొన్ని కుటుంబాలు వ్యవసాయ పనులు చేస్తుండగా మరికొందరు ఉద్యోగాలు చేస్తున్నట్లు చెప్పారు.

మరోవైపు, రాన్ బహదూర్ థాపా తన కుమార్తెలకు పెళ్లిళ్లు చేశాడు. వారు కూడా సమీపంలోనే స్థిరపడేందుకు వారికి సహాయం చేశాడు.  ప్రస్తుతం, ఇద్దరు మినహా, రాన్ బహదూర్ థాపా  కుమార్తెలందరూ నేపాలీ పామ్‌లో నివసిస్తున్నారు .అయితే, అస్సాంకు చెందిన రాన్ బహదూర్ థాపా కుటుంబం, మిజోరాం జియోనా చనా కుటుంబానికి మధ్య ఉన్న తేడాలు ఏమిటంటే, చనా కుటుంబం ఇప్పటికీ కలిసి జీవిస్తున్నప్పటికీ, బహదూర్ పెద్ద కుటుంబం కాలక్రమేణా విడిగా జీవిస్తోంది. బహదూర్ ఐదుసార్లు వివాహం చేసుకోగా, చానా 38 సార్లు వివాహం చేసుకున్నాడు.

ప్రస్తుతం, నేపాలీ పామ్ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులందరి దృష్టిని ఆకర్షించింది. ఒకే కుటుంబానికి చెందిన గ్రామం కావడంతో నేపాలీ పామ్‌లోని 1200 మంది ఓటర్లు కుటుంబ పెద్దలు ఎంపిక చేసిన అభ్యర్థికే ఓటు వేస్తారు. అందువల్ల, ప్రతి అభ్యర్థి గ్రామ పెద్దలతో, ముఖ్యంగా రాన్ బహదూర్ థాపా పెద్ద కుమారుడు, గ్రామ అధిపతి అయిన టిల్ బహదూర్ థాపాతో సత్సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇది కూడా చదవండి: దేశవ్యాప్తంగా పలుచోట్ల ఈడీ రైడ్స్…భారీగా నగదు పట్టివేత..!

Advertisment
Advertisment
తాజా కథనాలు