Corona : పెరిగిన కరోనా కేసులు.. తెలంగాణలో ఎన్నంటే..!

దేశ వ్యాప్తంగా వైద్యసిబ్బంది కరోనా టెస్టుల సంఖ్యను పెంచారు. తెలంగాణలో 1,322 శాంపిళ్లను పరీక్షించగా, 12 పాజిటివ్ కేసులున్నట్లు తేలింది. మరో 30 శాంపిళ్లకు సంబంధించి ఫలితాలు ఇంకా రాలేదు.

New Update
Corona : పెరిగిన కరోనా కేసులు.. తెలంగాణలో ఎన్నంటే..!

Corona Updates : దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా(Covid) కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్నిరోజులుగా దాదాపు అన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు పెద్దసంఖ్యలో పెరుగుతున్నాయి. మరోవైపు ఇటీవల జేఎన్1 వేరియంట్ వెలుగు చూసిన నేపథ్యంలో వైద్య సిబ్బంది దేశవ్యాప్తంగా కరోనా టెస్టుల సంఖ్యను గణనీయంగా పెంచారు. తెలంగాణ(Telangana) లోనూ ఇటీవల కేసులు వెలుగుచూస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, తెలంగాణలో 1,322 శాంపిళ్లను పరీక్షించగా, 12 పాజిటివ్ కేసులున్నట్లు తేలింది. మరో 30 శాంపిళ్లకు సంబంధించి ఫలితాలు ఇంకా రాలేదు.

ఇది కూడా చదవండి: తెలంగాణ గజగజ.. సింగిల్ డిజిట్‎కు పడిపోతున్న ఉష్ణోగ్రతలు

అయితే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు వైద్య నిపుణులు. తగిన జాగ్రత్తలు పాటిస్తూ నివారణ చర్యలు పాటిస్తే దీన్ని అధిగమించవచ్చంటున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సంబంధిత అధికారులతో శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వెంటిలేటర్ల పనితీరును పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఆక్సిజన్ కన్సన్​ట్రేటర్స్‌ను తక్షణమే వినియోగంలోకి తేవాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ల్యాబ్‌ల్లో ఒక్కరోజులో 16,500 ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయగలిగే సామర్థ్యం ఉందని, మరో 84 ప్రైవేటు ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌లు(RTPCR Labs) అందుబాటులో ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు. పాజిటివ్‌గా నిర్థారణ అయిన నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం సీడీఎఫ్‌డీ, గాంధీ ఆస్పత్రికి పంపించాలని మంత్రి సూచించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు