Nigeria : వర్షాలకు దెబ్బతిన్న జైలు గోడలు.. 118 మంది ఖైదీలు పరార్! వర్షాల వల్ల నైజీరియాలోని ఓ జైలు గోడలు దెబ్బతినడంతో సుమారు 118 మంది ఖైదీలు జైలు నుంచి పరారయ్యారు. దేశ రాజధాని అబూజ సమీపంలోని సులేజాలో రాత్రి భారీ వర్షాలు కురిశాయి. దీంతో పట్టణంలోని జైలు ప్రహరీ గోడలతోపాటు పలు భవనాలు దెబ్బతిన్నాయి. By Bhavana 26 Apr 2024 in క్రైం ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి Rains : వర్షాల వల్ల నైజీరియా(Nigeria) లోని ఓ జైలు గోడలు(Prison Walls) దెబ్బతినడంతో సుమారు 118 మంది ఖైదీలు జైలు నుంచి పరారయ్యారు. దేశ రాజధాని అబూజ సమీపంలోని సులేజాలో రాత్రి భారీ వర్షాలు(Heavy Rains) కురిశాయి. దీంతో పట్టణంలోని జైలు ప్రహరీ గోడలతోపాటు పలు భవనాలు దెబ్బతిన్నాయి. దీన్నే అదనుగా భావించిన 118 మంది ఖైదీలు జైలు నుంచి పరారైనట్లు జైలు అధికారులు తెలిపారు. పారిపోయిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టామని, వారిలో ఇప్పటివరకు 10 మందిని పట్టుకోగలిగామని చెప్పారు. మిగిలినవారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నదని తెలిపారు. అయితే తప్పించుకున్నవారు ఎవరనే విషయాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు. గతంలో ఇదే జైలులో బోకో హరమ్ గ్రూప్ సభ్యులను బంధించారు. పరారైనవారిలో వారు కూడా ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నైజీరియా జైళ్ల నుంచి ఖైదీలు తప్పించుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఉగ్రవాదుల దాడులు(Terrorists Attack), వసతుల లేమి కారణంగా ఈ మధ్యకాలంలో దేశంలోని జైళ్ల నుంచి ఖైదీలు పారిపోయిన ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. Also read: కోటి విలువైన వజ్రాభరణాలు చోరీ..కారు డ్రైవర్ మీదే అనుమానం! #rains #nigeria #escape #prision మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి