Rajasthan:10 ఏళ్ల బాలిక పై అత్యాచారం చేసిన దుండగుడు!

రాజస్థాన్‌లో మరోసారి అత్యాచార ఘటన వెలుగు చూసింది. ఈ అత్యాచార ఘటన ధోల్‌పూర్ జిల్లాలోని కౌలారి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మలవిసర్జనకు పొలానికి వెళ్లిన ఓ పదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

New Update
Rajasthan:10 ఏళ్ల బాలిక పై అత్యాచారం చేసిన దుండగుడు!

రాజస్థాన్‌లో మరోసారి అత్యాచార ఘటన వెలుగు చూసింది.  ధోల్‌పూర్ జిల్లాలోని కౌలారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ అత్యాచార ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన 10 ఏళ్ల బాలిక  మలవిసర్జనకు పొలానికి వెళ్లింది.  ఆ సమయంలో గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆమెను పట్టుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక కేకలు వేయటంతో  ఆ దుండగుడు ఆమె నోటిలో ప్లాస్టిక్ బ్యాగ్‌తో కుక్కివేసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పొలంలో నిర్జీవంగా పడిన బాలికను చూసిన గ్రామస్తులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బాలికను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా బాలిక పై అత్యాచారం జరిగినట్టుగా వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి పోలీసులు నిందితుడి కోసం దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు కథనం ప్రకారం..ఆదివారం ఉదయం ఈ అత్యాచార ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో బాలిక పొలంలో మల విసర్జన చేసేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అదే సమయంలో గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆమెను చూసి అక్కడికి వెళ్లాడు. ఒంటరిగా ఉన్న బాలికను చూసి..ఆమెను పట్టుకుని అరవకుండా నోట్లో ప్లాస్టిక్ బ్యాగ్ ను ఆ నిందితుడు కుక్కి అత్యాచారం చేసి అక్కడి నుంచి పరారైనట్టు పోలీసులు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు