ఖాళీ కడుపుతో సొరకాయ రసం తాగితే బరువు ఇట్టే తగ్గుతారు.!

సొరకాయలో క్యాలరీలు తక్కువగా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సొరకాయలో ఐరన్, విటమిన్, పొటాషియం మరియు ఫైబర్ ఉంటాయి. ఇవన్నీ మన శరీర బరువును తగ్గించడంలో సహాయపడతాయి.క్రమం తప్పకుండా సొరకాయ జ్యూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకుంటే.. అరోగ్య సమస్యలు దూరం అవుతాయని వైద్యులు చెబుతున్నారు.

New Update
ఖాళీ కడుపుతో సొరకాయ రసం తాగితే బరువు ఇట్టే తగ్గుతారు.!

సొరకాయలో విటమిన్ సి, బి, రైబోఫ్లేవిన్, జింక్, థయమిన్, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి హాని చేసే కొవ్వు ఇందులో ఉండదు. బరువు తగ్గాలనుకునే వారికి సొరకాయ బెస్ట్‌ ఆప్షన్. దీనిలో ఉండే అధికంగా ఉండే పీచు జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. సొరకాయను కూరగా తీసుకోవడం కంటే.. జ్యూస్‌గా తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా సొరకాయ జ్యూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకుంటే.. అరోగ్య సమస్యలు దూరం అవుతాయని ఆయుర్వేద వైద్యురాలు దీక్షా భావ్‌సర్‌ అన్నారు.

సొరకాయ జ్యూస్‌ క్రమం తప్పకుండా తాగితే.. హైపర్‌టెన్షన్‌ కంట్రోల్‌లో ఉంటుందని ఆయుర్వేద వైద్యురాలు దీక్షా భావ్‌సర్‌ అన్నారు. సొరకాయలో ఉండే.. పొటాషియం రక్తపోటును కంట్రోల్‌లో ఉంచుతుంది. హైపర్‌టెన్షన్‌తో బాధపడేవారు.. పరగడుపున సొరకాయ జ్యూస్‌ తాగితే బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. దీనిలో కొద్ది మొత్తంలో లభించే సూక్ష్మ పోషక ఖనిజాలు గుండె జబ్బులు రాకుండా చూస్తాయి.సొరకాయ జ్యూస్‌ న్యాచురల్‌ క్లెన్సర్‌గా పనిచేస్తుంది. ఇది తాగితే.. శరీరం నుంచి విష పదార్థాలు తొలగుతాయి. ఈ జ్యూస్‌తో అవయవాల పనితీరు మెరుగుపడుతుంది.

సొరకాయ వాత, పిత్త దోషాలను సమతుల్యం చేస్తుంది. దీనిని అల్సర్‌, జ్వరం, నొప్పులను, శ్వాసకోసం సమస్య చికిత్సలో ఉపయోగిస్తారు. యూరినరీ ఇన్ఫెక్షన్స్‌కి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. యూరిన్‌లో ఉండే యాసిడ్ కంటెంట్‌ని బాలెన్స్ చేయడం ద్వారా ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.ఈ జ్యూస్ ఆకలిని తగ్గిస్తుంది. మెటబాలిజంను మెరుగుపరుస్తుంది. దీంతో.. బరువు తగ్గడం తేలికవుతుంది. శరీరంలోని క్యాలరీలను అతి సులభంగా తగ్గిస్తుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు