YSRCP Second List: వైసీపీ సెకండ్ లిస్ట్ విడుదల.. అభ్యర్థులు వీరే..

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో అధికార వైఎస్‌ఆర్‌సీపీ తన సెకండ్ లిస్ట్ అభ్యర్థుల వివరాలను వెల్లడించింది. మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణా రెడ్డి ఈ సెకండ్ లిస్ట్‌ను విడుదల చేశారు.

New Update
YSRCP Second List: వైసీపీ సెకండ్ లిస్ట్ విడుదల.. అభ్యర్థులు వీరే..

YSRCP Second List: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న తరుణంలో అధికార వైఎస్‌ఆర్‌సీపీ కీలక ప్రకటన చేసింది. అసెంబ్లీ నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి రెండో విడత అభ్యర్థుల వివరాలను విడుదల చేసింది. మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణా రెడ్డి ఈ సెకండ్ లిస్ట్‌ను విడుదల చేశారు. ఎన్నికల నేపథ్యంలో గత కొద్ది రోజులగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు పార్టీ అధినేత జగన్. ఈ క్రమంలోనే మంగళవారం నాడు సీఎం క్యాంపు ఆఫీసులో పార్టీ ముఖ్య నేతలతో చర్చలు జరిపిన సీఎం జగన్.. 27 నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లను ఖరారు చేశారు. సీఎంతో సమావేశం అనంతరం సజ్జల రామకృష్ణా రెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ నియోజకవర్గాల ఇన్ చార్జిలకు సంబంధించిన సెకండ్ లిస్ట్ విడుదల చేశారు.

వైసీపీ విడుదల చేసిన సెకండ్ లిస్ట్ అభ్యర్థులు వీరే..

👉 అనంతపురం ఎంపీ - మాలగుండ్ల శంకరనారాయణ
👉 హిందూపురం ఎంపీ - జోలదరాశి శాంత
👉 అరకు ఎంపీ (ఎస్టీ) - కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి
👉 రాజాం (ఎస్సీ) - తాలె రాజేష్
👉 అనకాపల్లి - మలసాల భరత్ కుమార్
👉 పాయకరావుపేట (ఎస్సీ) - కంబాల జోగులు
👉 రామచంద్రాపురం - పిల్లి సూర్యప్రకాష్
👉 పి.గన్నవరం (ఎస్సీ) - విప్పర్తి వేణుగోపాల్
👉 పిఠాపురం - వంగ గీత
👉 జగ్గంపేట - తోట నరసింహం
👉 ప్రత్తిపాడు - వరుపుల సుబ్బారావు
👉 రాజమండ్రి సిటీ - మార్గాని భరత్
👉 రాజమండ్రి రూరల్ - చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
👉 పోలవరం (ఎస్టీ) - తెల్లం రాజ్యలక్ష్మి
👉 తిరుపతి - భూమన అభినయ్ రెడ్డి
👉 గుంటూరు ఈస్ట్ - షేక్ నూరి ఫాతిమా
👉 మచిలీపట్నం - పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)
👉 చంద్రగిరి - చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
👉 పెనుకొండ - కె.వి. ఉషా శ్రీచరణ్
👉 కళ్యాణదుర్గం - తలారి రంగయ్య
👉 అరకు (ఎస్టీ) - గొడ్డేటి మాధవి
👉 పాడేరు (ఎస్టీ) - మత్స్యరాస విశ్వేశ్వర రాజు
👉 విజయవాడ సెంట్రల్ - వెలంపల్లి శ్రీనివాస రావు
👉 విజయవాడ వెస్ట్ - షేక్ ఆసిఫ్

Also Read:

హైదరాబాద్‌లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్.. చుక్కలు చూస్తున్న వాహనదారులు.. ఇదిగో వీడియోలు!

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఢీకొన్న రెండు కార్లు..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP - TG Earthquake: ఏపీ & తెలంగాణ ప్రజలకు హెచ్చరిక.. భారీ భూకంపం!

తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలోని రామగుండంలో భూకంపం వచ్చే అవకాశం ఉందని ఎర్త్‌క్వేక్ రీసర్చ్ అండ్ అనాలసిస్ సంస్థ తెలిపింది. భూ ప్రకంపనలు హైదరాబాద్, వరంగల్, అమరావతి వరకు చేరే అవకాశం ఉందని అందులో పేర్కొంది. ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.

New Update
earthquake warning for Andhra Pradesh and Telangana soon

earthquake warning for Andhra Pradesh and Telangana soon

ఈ మధ్య వరుస భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఊహించని భూప్రకంపనలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికే దేశ, ప్రపంచ వ్యాప్తంగా భూమి కంపించింది. అందులో గతంలో ఏపీ, తెలంగాణ వంటి రెండు తెలుగు రాష్ట్రాలను భూకంపం భయబ్రాంతులకు గురి చేసింది. 

ఇది కూడా చదవండి: సన్నటి కనుబొమ్మలతో ఇబ్బంది పడుతున్నారా..ఇలా చేస్తే మందంగా పెరుగుతాయి

తాజాగా మరోసారి భూకంప హెచ్చరికలు వచ్చాయి. తెలంగాణలో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే వారం రోజుల్లో రామగుండం కేంద్రంగా భారీ భూకంపం ప్రజలను భయపెట్టే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈసారి భూకంప తీవ్రత భారీ స్థాయిలో ఉంటుందని చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి: అతిగా ఆలోచించడం వల్ల కలిగే సమస్యలు

ఏపీ & తెలంగాణలో భూకంపం

ఈ మేరకు Epic -Earthquake Research & Analysis ఒక ట్వీట్‌ చేసింది. అందులో హైదరాబాద్, వరంగల్‌.. అలాగే అమరావతి వరకు ప్రకంపనలు వచ్చే ఛాన్స్ ఉందని తెలిపింది. తమ పరిశోధనల ఆధారంగా రాష్ట్రంలోని రామగుండం సమీపంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని అందులో రాసుకొచ్చింది. 

Also Read: డ్రాగన్ వచ్చేది అప్పుడే..! రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న NTR 31..

అయితే ఈ భూకంపాల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని లేదని కేంద్ర ఐఎండీకి సంబంధించిన అధికారులు చెబుతున్నారు. కాగా అప్రమత్తంగా ఉండటం మంచిదే. కానీ నిర్ధారణలేని సమాచారంపై ఎవరూ భయపడాల్సిన పనిలేదని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. 

Also Read: “SSMB29” రిలీజ్ డేట్ పై హాట్ బజ్! ఆ సెంటిమెంట్‌ కలిసొస్తుందా?

(ap earthquake | ap earthquake latest news latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment