YS Sunitha: వైఎస్ చనిపోయిన తర్వాత ఏం జరిగిందంటే? సంచలన విషయాలు బయటపెట్టిన సునీత! అవినాష్ రెడ్డి ఓడిపోవాలనేదే తన లక్ష్యమని వైఎస్ సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. హత్య చేసిన వారు చట్టసభల్లో ఉండకూడదన్నారు. తనకు రాజకీయాలు ఇష్టం లేదని..న్యాయం మాత్రమే కావాలని స్పష్టం చేశారు. షర్మిలకు మంచి పేరు రావడంతో జగన్ ఆమెను పక్కన పెట్టారని వ్యాఖ్యానించారు. By Jyoshna Sappogula 06 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి YS Sunitha: వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత జరిగిన పరిణామాలను వెల్లడించారు మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత. వైఎస్ఆర్ చనిపోయాక పులివెందుల సీటు విషయంలో చర్చలు జరిగాయన్నారు. పులివేందుల టికెట్ విజయమ్మకు లేదా షర్మిలకు ఇవ్వాలని ప్రతిపాదన జరిగిందని చెప్పుకొచ్చారు. వివేకానంద రెడ్డి తాను కూడా పోటీ చేస్తానని స్పష్టం చేశారన్నారు. అయితే ఆ ఎన్నికల్లో విజయమ్మ గెలిచిందని వివరించారు. అందుకే పక్కన పెట్టారు.. వైసీపీ పార్టీ ఏర్పాటు అయిన అనంతరం కుటుంబం అంతా ఒక్కటిగా ఉండాలని వివేకానంద రెడ్డి వైసీపీలో చేరారన్నారు. సీబీఐ కేసుల నేపథ్యంలో జగన్ జైలుకు వెళ్తే షర్మిల పాదయాత్ర చేసిందని.. పిల్లలను వొదిలేసి రోడ్లపై తీరిగిందని వాపోయారు. షర్మిల కు మంచి పేరు రావడంతో ఆమెను పక్కన పెట్టాలని జగన్ నిర్ణయించారని తెలిపారు. షర్మిలను పక్కన పెట్టి అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దుని వివేకానంద రెడ్డి పట్టు బట్టారన్నారు. జగన్ టిక్కెట్ అవినాష్ రెడ్డికే ఇవ్వడంతో తప్పదని అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చినా ఆయన గెలుపు కోసం పనిచేశారని చెప్పారు. ఆ తరువాత వెన్నుపోటు రాజకీయాలు మొదలు అయ్యాయని కామెంట్స్ చేశారు. అవసరం ఏంటి? 2019 ఎన్నికల వేళ పులివెందులలో వైఎస్ వివేకానందరెడ్డి ఓటు తీసేశారని అయితే, ఓటు తీయాల్సిన అవసరం ఏంటనే అనుమానం మొదలైందన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా, లేదా పార్టీ నుంచి పోటీ చేస్తారని వివేకానంద రెడ్డి ఓటు తొలగించారా? అనే సందేహం వచ్చిందన్నారు. హత్యలు లేకుండా చేయాలని చూస్తున్న సమయంలో వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారన్నారు. దీని వెనక ఎవరున్నారో తెలుసుకోవాలని ప్రయత్నం మొదలు పెట్టానని..హత్య చేయించిన వారిని కనిపెట్టి శిక్ష వేయించాలనే ప్రయత్నాలు చేస్తున్నానని తెలిపారు. Also Read: వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలపై షర్మిల ఫోకస్ నా లక్ష్యం ఇదే.. తనకు ఇందులో ఎన్నో అడ్డంకులను సృష్టిస్తున్నారని..న్యాయం కోసం పోరాడేందుకు దేవుడు తనకెంతో స్థోమత ఇచ్చారని చెప్పుకొచ్చారు. తాను కాకపోతే ఇంకెవరు ఇలాంటి వారికి శిక్ష వేయిస్తారని.. తనకు అడ్డంకులు ఉండకూడదు అంటే హత్యలు చేయించేవారికి పవర్ ఉండకూడదనేదే తన లక్ష్యమని పేర్కొన్నారు. హత్య చేసిన వారు చట్టసభల్లో ఉండకూడదన్నారు. తనకు రాజకీయాలు ఇష్టం లేదని.. రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేశారు. అవినాష్ రెడ్డి ఓడిపోవాలనేదే తన లక్ష్యమన్నారు. ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచన చేసుకోవాలని సూచించారు. దస్తగిరి చంపాడు అనేది తప్పుడు ఆరోపణ అని అన్నారు. దస్తగిరి నాలుగో నిందితుడని చెప్పారు. ఎంపీ అవినాష్ రెడ్డి ఓడిపోవడంతో పార్టీ, వైసీపీ ప్రభుత్వం పోవాలన్నారు. సీఎంగా జగన్ మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని ప్రొటెక్ట్ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కత్తితో నరికేదాన్ని.. కర్నూలులో రెండు రోజుల పాటు సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జైలులో ఉన్న ఏ4 వద్దకు వెళ్ళి 20కోట్లు ఇచ్చి స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలని చెప్పారన్నారు. తనకు న్యాయం జరిగేందుకు ఎవరితో అయినా మాట్లాడుతానన్నారు. తనకు రాజకీయాలు వద్దని న్యాయం కావాలని వ్యాఖ్యానించారు. తాను 20సంవత్సరాల క్రితమే రాజకీయాల్లోకి రాకూడదు అని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తప్పు జరిగింది అని తెలిసి కూడా ఎందుకు సైలెంట్ గా ఉండాలి..రివేంజ్ తీర్చుకోవాలి అనుకుంటే నేను కడప వెళ్లి కత్తితో నరికేదాన్ని అని.. కాని తాను సిస్టంను మెరుగుపరుచుకోవాలనుకుంటున్నానని తెలిపారు. కేవలం వ్యక్తిగతం సీబీఐ కేసును ఇంతవరకు తెచ్చారు.. ఇది చాలా గొప్ప విషయమని హర్షం వ్యక్తం చేశారు. న్యాయం ఆలస్యం అయినా సీబీఐకి క్రెడిట్ ఇస్తానన్నారు. నా వెనకాల ఎవరూ లేరని.. బిల్డింగ్ బయటకు వేస్తే నన్ను కూడా నరికేసినా నరికేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం తన వ్యక్తిగత పోరాటమని టీడీపీది కాదని వ్యాఖ్యానించారు. నా పోరాటం చూసి ఈ రాష్ట్రం అంతా నా వెనకాల ఉందని వైసీపీ పార్టీ వాళ్లు కూడా నా కష్టం చూసి బాదపడుతున్నారని చెప్పుకొచ్చారు. వైఎస్ వివేకా చనిపోయే ముందు రోజు చివరి మీటింగ్ లో కూడా వైసీపీ, జగన్, అవినాష్ రెడ్డి గెలుపు కోసం పని చేశారని.. వాళ్ళ కోసం ప్రచారం చేస్తున్నా కూడా చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. #ys-sunitha #avinash-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి