YS Sunita: హోంమంత్రి అనితతో వైఎస్‌ సునీత భేటీ

ఏపీ హోంమంత్రి అనితను వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత ఈ రోజు అమరావతిలోని సచివాలయంలో కలిశారు. వివేకా హత్య కేసు విషయంపై వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తనకు న్యాయం దక్కేలా సహకరించాలని హోంమంత్రిని సునీత కోరినట్లు సమాచారం.

New Update
YS Sunita: హోంమంత్రి అనితతో  వైఎస్‌ సునీత భేటీ

YS Sunita: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ వివేకా కూతురు వైఎస్ సునీత ఈరోజు హోంమంత్రి అనితతో భేటీ అయ్యారు. సెక్రటేరియట్‌లోని రెండో బ్లాక్ లోని ఛాంబర్ లో అనితతో సమావేశమయ్యారు సునీత. గత ఐదేళ్లుగా తన తండ్రి వివేకా హత్య కేసుపై న్యాయపోరాటం చేస్తున్న సునీత తాజాగా హోంమంత్రితో భేటీ అవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. ప్రస్తుతం కోర్టు పరిధిలో వివేకా మర్డర్‌ కేసు ఉన్న సంగతి తెలిసిందే.

అన్నపై పోరాటం..

వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులకు శిక్ష పడాలని గత ఐదు ఏళ్లుగా సునీత న్యాయ పోరాటం చేస్తున్నారు. తన తండ్రిని కడప ఎంపీ అవినాష్ రెడ్డి హత్య చేయించాడని ఆరోపణలు చేస్తున్నారు సునీత.  అవినాష్ రెడ్డిని జగన్ కాపాడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై ఆమె సుప్రీం కోర్టును సైతం ఆశ్రయించారు. ఇదే కేసులో అవినాష్ రెడ్డి పలుమార్లు సీబీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైఎస్ వివేకా హత్య కేసు కీలకంగా మారింది. వైఎస్ షర్మిల, సునీత ఈ విషయంలో అన్న జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు.

సొంత బాబాయిని హత్య చేసిన నిందితుడిని జగన్ వెనకేసుకొని వస్తున్నాడని అనేక సమావేశాల్లో ప్రస్తావించారు. నాటి ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ సైతం ఈ కేసు విషయమై జగన్ పై ఆరోపణలు గుప్పించింది. జగన్ దారుణ ఓటమిలో ఈ కేసు కూడా కీలక పాత్ర పోషించిందన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ హోంమంత్రిని వివేకానందరెడ్డి కూతురు సునీత కలవడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తన తండ్రి హత్య కేసులో తనకు న్యాయం దక్కేలా సహకరించాలని ఆమె కోరినట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు