YS Sharmila met Sonia Gandhi:సోనియా గాంధీని కలిసిన వైఎస్ షర్మిల..విలీనం ఖరారే!! వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల ఈ రోజు ఉదయం తన భర్త అనిల్ తో కలిసి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. సోనియా గాంధీతో ప్రత్యేకంగా సమావేశం అయిన షర్మిల రాష్ట్రంలో తాజా రాజకీయ పరస్థితులపై చర్చించిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ భేటీతో వైఎస్ఆర్టీపీ పార్టీ కాంగ్రెస్ విలీనం దాదాపుగా ఖరారు అయినట్టే. ఎందుకంటే ఆమె పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడానికి పార్టీ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినందుకే షర్మిల తన భర్తతో పాటు సోనియా గాంధీని కలిసినట్లు సమాచారం. By P. Sonika Chandra 31 Aug 2023 in రాజకీయాలు New Update షేర్ చేయండి YS Sharmila met Sonia Gandhi:వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల ఈ రోజు ఉదయం తన భర్త అనిల్ తో కలిసి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. సోనియా గాంధీతో ప్రత్యేకంగా సమావేశం అయిన షర్మిల రాష్ట్రంలో తాజా రాజకీయ పరస్థితులపై చర్చించిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ భేటీతో వైఎస్ఆర్టీపీ పార్టీ కాంగ్రెస్ విలీనం దాదాపుగా ఖరారు అయినట్టే. ఎందుకంటే ఆమె పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడానికి పార్టీ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినందుకే షర్మిల తన భర్తతో పాటు సోనియా గాంధీని కలిసినట్లు సమాచారం. Your browser does not support the video tag. పార్టీ విలీనానికి చాలా రోజుల నుంచి ప్రయత్నాలు..! తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ తన తండ్రి వైఎస్సార్ అడుగుజాడల్లో నడుస్తానంటూ షర్మిల వైఎస్ఆర్టీపీ పార్టీ స్థాపించడం జరిగింది. అయితే తాను పార్టీ స్థాపించినప్పట్నుంచి తెలంగాణ అధికార పక్షానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తాను ఒంటరిగా పోరాటం చేయడం కన్నా కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకు వెళ్తే బాగుంటుందని భావించిన షర్మిల అందుకు అనుగుణంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత ఆమె డీకే శివకుమార్ తో పలుమార్లు కలిసి ఈ ప్రస్తావనను పెట్టడం జరిగింది. దీంతో ఆయన మధ్యవర్తిత్వం జరిపి షర్మిలను హైకమాండ్ దగ్గరికి పంపారు. Your browser does not support the video tag. దీంతో షర్మిల నెల రోజుల క్రితం ఖర్గేతో కూడా కలిశారు. అయితే ఆమెను తెలంగాణలో కాకుండా ఏపీ పాలిటిక్స్ లో ఉపయోగించుకోవాలని అధిష్టానం భావిస్తున్నట్టుగా సమాచారం. ఆ మంతనాలు కొన్ని రోజుల నుంచి కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆమె ఈరోజు సోనియా గాంధీతో భేటీ కావడంతో దాదాపుగా షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. వ్యతిరేకిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు..! అయితే షర్మిల పార్టీ విలీనాన్ని ముందు నుంచి కూడా టీపీసీసీ రేవంత్ రెడ్డితో పాటు కొందరు సీనియర్లు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఆమె పార్టీ విలీనంతో మేలు కన్నా పార్టీకి నష్టమే ఎక్కువగా జరుగుతుందని రేవంత్ రెడ్డి హైకమాండ్ కు చెప్పారు. హైకమాండ్ కూడా అందుకు సానుకూలంగానే రియాక్ట్ అయింది. దీంతో ఖర్గేతో షర్మిల మీట్ అయిన సమయంలోనే ఆమెను ఏపీ పాలిటిక్స్ లో వాడుకోవాలని భావించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో షర్మిల పాలేరు టికెట్ అడగడంతో పాటు తన పార్టీలోని కొందరు నేతల కోసం టికెట్లను డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. మరో వైపు కర్ణాటక నుంచి షర్మిలకు రాజ్యసభకు పంపుతారన్న ప్రచారం కూడా సాగుతోంది. అయితే సోనియా గాంధీతో భేటీ నేపథ్యంలో త్వరలోనే అన్ని విషయాలపై క్లారిటీ రానుంది. అన్నతో చెల్లి ఢీ..! అయితే ఏపీకి షర్మిల వస్తే జగన్ తో ఢీ అంటే ఢీ అనే విధంగా రాజకీయాలు చేసే అవకాశాలున్నాయి. షర్మిల ఏపీ కాంగ్రెస్ కి అధ్యక్షురాలుగా వస్తే వైసీపీ నుండి కూడా వలసలు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వైసీపీలోని అసంతృప్తి నేతలు షర్మిల వైపుకు వెళ్లే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇక షర్మిలతో ఇప్పటకీ టచ్ లో కొంతమంది నేతలున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే కొంత మంది వైసీపీ నేతలు షర్మిల ఏపీ కి వస్తే.. ఆమె వెనుక నడవడానికి సిద్ధంగా ఉన్నామని బహిరంగంగానే అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో అన్నాచెల్లెల ఫైట్ పై ఆసక్తి నెలకొంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి