Kadapa: రసవత్తరంగా పులివెందుల రాజకీయం.. సౌభాగ్యమ్మకు కౌంటరిస్తూ అవినాష్ తల్లి లక్ష్మి లేఖ పులివెందుల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. నిన్న జగన్‌ను విమర్శిస్తూ వివేకా భార్య సౌభాగ్యమ్మ లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాజాగా, సౌభాగ్యమ్మకు కౌంటరిస్తూ అవినాష్ తల్లి లక్ష్మి లేఖ రాశారు. శత్రువుల చేతిలో పావులుగా మారిన మీరు ఇప్పటికైనా తప్పుని తెలుసుకోండి అంటూ పేర్కొన్నారు. By Jyoshna Sappogula 26 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి YS Viveka Issue: పులివెందుల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. నిన్న జగన్‌ను విమర్శిస్తూ వివేకా భార్య సౌభాగ్యమ్మ లేఖ రాసిన సంగతి తెలిసిందే. వివేక హత్యకు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా పోటి చేసేందుకు అవకాశం ఇచ్చావన్నారు. న్యాయం కోసం పోరాడుతున్న నీ చెల్లెళ్లను హేళన చేస్తూ, దాడులు చేస్తున్నా నీకు పట్టడం లేదా ? అని ప్రశ్నించారు. సునీతకు మద్దతిచ్చిన షర్మిలను కూడా టార్గెట్ చేస్తుంటే నువ్వు నిమ్మకు నిరెత్తినట్లు ఉండటం ఏంటి? అని నిలదీశారు. ఇలాంటి దుశ్చర్యలు నీకు ఏమాత్రం మంచిది కాదని.. చివరి ప్రయత్నంగా న్యాయం, ధర్మం గురించి ఆలోచించు అంటూ సౌభాగ్యమ్మ లేఖలో పేర్కొన్నారు. Also Read: భర్త పై పోలీస్ కేసు పెట్టిన అనామిక.. రాజ్ నిజం బయటపెడతాడా..? కళ్యాణ్ పరిస్థితి ఏంటీ..? అయితే, తాజాగా, సౌభాగ్యమ్మకు కౌంటరిస్తూ అవినాష్ తల్లి లక్ష్మి లేఖ రాశారు. తన తండ్రిని కోల్పోయినప్పుడు జగన్‌కి పెద్ద దిక్కుగా ఉండాల్సిన మీరు.. రాజకీయ స్వార్థంతో విజయమ్మపై పోటీ చేసినప్పుడు వాళ్లు ఎంత బాధపడి ఉంటారన్నారు. జగన్ మనోవేదన ఆ రోజు మీకు గుర్తుకు రాలేదా ? సౌభాగ్యమ్మా అని ప్రశ్నించారు. మీ కుమార్తె సునీత నిజంగా న్యాయం కోసం పోరాటం చేస్తే కచ్చితంగా జగన్ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. శత్రువుల చేతిలో పావులుగా మారిన మీరు ఇప్పటికైనా తప్పుని తెలుసుకోండని సూచించారు. Also Read: బిడ్డా గన్ పార్క్ కి రా.. నువ్వో.. నేనో తేల్చుకుందాం! ఇలా తోటి కోడళ్ల మధ్య లేఖల పంచాయితీ నడుస్తోంది. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో ఏపీ పాలిటిక్స్ మొత్తం వివేకా హత్య చుట్టే తిరుగుతోంది. నిన్నటి సభలో వివేకా హత్యపై జగన్ హాట్ కామెంట్స్ చేశారు. సునీత, షర్మిలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. #ys-avinash-reddy-mother మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి