Elvish Yadav: పాము విషాన్ని రేవ్ పార్టీలకు సరఫరా చేస్తున్నా..బిగ్ బాస్ విన్నర్! పాము విషంతో రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నాడనే ఆరోపణలతో అరెస్టయిన ప్రముఖ యూట్యూబర్ హిందీ బిగ్ బాస్ ఓటీటీ విజేత ఎల్విష్ యాదవ్ విచారణలో పోలీసులకు కీలక విషయాలు వెల్లడించారు. By Durga Rao 18 Mar 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి గత ఏడాది పాము విషాన్ని రేవ్ పార్టీలో వినియోగించాడనే ఆరోపణలతో ప్రముఖ యూట్యూబర్ హిందీ ఓటీటీ బిగ్ బాస్ విజేత ఎల్విష్ యాదవ్ పై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. కొంత కాలంగా పరారీలో ఉన్న ఎల్విష్ ను ఆదివారం నోయిడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. రిమాండ్ లో ఉంచి పోలీసులు విచారించగా అతను కీలక విషయాలు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. రేవ్ పార్టీల కోసం అతడు పాములను వాటి విషయాన్ని ఆర్డర్ చేసేవాడని తేలిందన్నారు. ఇప్పటికే కేసులో అరెస్ట్ అయిన వ్యక్తులతో ఎల్విష్ కు సంబంధాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. గత ఏడాది నవంబర్ లో నోయిడాలోని సెక్టార్ 49 లో జరుగుతున్న ఓ రేవ్ పార్టీ పై పోలీసులు దాడులు నిర్విహించారు. ఈ దాడిలో ఐదుగురు వ్యక్తుల పై కేసు నమోదు చేశారు. వారి వద్ద నుంచి కొన్ని పాములను 20 ఎంఎల్ విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో ఎల్విష్ యాదవ్ పేరును ఎఫైఆర్ లో పోలీసులు చేర్చారు. ఎల్వీష్ కొన్ని పాములు పట్టుకున్న వీడియో బయటకి రావటంతో అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో అదుపులో తీసుకున్న వ్యక్తులను విచారించగా అసలు విషయం తెలిసింది. ఎల్విష్ రేవ్ పార్టీలకు పాములను వాటి విషాన్ని సరఫరా చేస్తాడని నిందితులు పోలీసులకు చెప్పారు. ఇందుకోసం భారీగా డబ్బు తీసుకుంటామని వారు అంగీకరించారు. వారిని అదుపులో తీసుకున్నారని తెలిసిన వెంటనే ఎల్విష్ పరారైయాడు. #rave-parties #elvish-yadav #snake-venom మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి