Mens Marriage : ఆ ఊళ్లో మగాళ్లకు పెళ్లి కావట్లే..! ఎందుకో తెలిస్తే షాకవుతారు సత్యసాయి జిల్లా కందుకూర్లపల్లి, చిన్నకోడిపల్లి గ్రామాలకు తారు రోడ్డు లేదు. ఆ ఊళ్లో యువకులకు పెళ్లే కావడం లేదట. పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదని బాగా హర్ట్ అయిన వాళ్లంతా డైరెక్ట్‌గా మంత్రి ఉషశ్రీకి తమ గోడు వెల్లబోసుకున్నారు. By Naren Kumar 22 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ అనంతపురం New Update షేర్ చేయండి Satya Sai District : ఓ ఊళ్లో యువకులకు పెళ్లే(Youth Men Marriage) కావడం లేదట. పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదని బాగా హర్ట్ అయిన వాళ్లంతా డైరెక్ట్‌గా మంత్రికే తమ గోడు వెల్లబోసుకున్నారు. చదువూ సంధ్యా లేకపోవడమో.. ప్రయోజకులు కాకపోవడమో వారి సమస్య కాదు.. మరి పిల్లనివ్వడానికి ఇంకేం చూస్తారనేనా మీ డౌటు?.. ఆ ఊరికి రోడ్డు లేదట. అందుకే అక్కడికి పిల్లనివ్వాలంటే అమ్మాయి తల్లిదండ్రులు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారట. ఇది కూడా చదవండి : కాళేశ్వరంలో మేఘా దోపిడీ నిజమే.. విజిలెన్స్ విచారణలో సంచలన నిజాలు సత్యసాయి జిల్లా(Sathyasai District) కందుకూర్లపల్లి(Kandukurpalli), చిన్నకోడిపల్లి గ్రామాలకు తారు రోడ్డు లేదు. ఆ ఊళ్లకు పిల్లనివ్వడానికి ఆడపిల్ల తల్లిదండ్రులు ముందుకు రావడం లేదు. దీంతో అక్కడ పెళ్లికాని ప్రసాదులు పెరిగిపోతున్నారు. దీనిపై ఓ మహిళ డైరెక్ట్‌గా మంత్రికే ఫిర్యాదు చేశారు. దయచేసి తమ ఊరికి ఓ తారు రోడ్డు వేసి పుణ్యం కట్టుకోవాలంటూ గ్రామ పర్యటనకు వచ్చిన మంత్రి ఉషశ్రీని వేడుకున్నారు. ఊరి జనమంతా వెళ్లి తమ డిమాండ్‌ను మంత్రి ఎదుట ఉంచారు. ఇది కూడా చదవండి : Metro: మెట్రో ఫేజ్-2 విస్తరణ రూట్‌మ్యాప్ విడుదల సోమవారం రోజు కందుకూర్లపల్లి, చిన్నకోడిపల్లి గ్రామాల్లో మంత్రి ఉషశ్రీ(Minister Ushashri) పర్యటించారు. ఈ సందర్భంగా రెండు గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేదని మంత్రి దృష్టికి తెచ్చారు. మిగిలిన సమస్యలు ఎలా ఉన్నా, మొదట ఊళ్లకు తారు రోడ్డు వేయించాలంటూ యువకులు మంత్రిని వేడుకున్నారు. రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చే దాకా వదిలేది లేదంటూ పట్టుబట్టారు. చివరికి వారి బాధ అర్థం చేసుకున్న మంత్రి ఉషశ్రీ రోడ్డుపై హామీ ఇవ్వడంతో వాళ్ల మొహాలు వెయ్యి వాల్టుల బల్బుల్లా వెలిగిపోయాయి. మొత్తానికి ఆ ఊర్ల యూత్ పెళ్లి కష్టాలు మంత్రి ఉషశ్రీ తో పాటు, అక్కడున్న వాళ్లకూ నవ్వు తెప్పించాయి. #minister-usha-sri #not-married-men #sri-sathyasai-district మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి