Vijayasai Reddy : టీడీపీ, జనసేన వాటా ఇంతే: విజయసాయి రెడ్డి

టీడీపీ గెలుస్తుందనే నమ్మకం బీజేపీకి ఏ మాత్రం లేదన్నారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి. రాష్ట్రంలోని ఒక్క ఎంపీ సీటు కూడా గెలవదని పేర్కొన్నారు. సొంతంగా 370 సీట్లు.. ఎన్డీయే కూటమికి 400 సీట్లను బీజేపీ టార్గెట్ పెట్టుకుందన్నారు. అందులో టీడీపీ,జనసేన వాటా సున్నా అంటూ ఎద్దేవా చేశారు.

New Update
Vijayasai Reddy : టీడీపీ, జనసేన వాటా ఇంతే: విజయసాయి రెడ్డి

YCP Vijayasai Reddy: టీడీపీపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి సోషల్ మీడియాలో స్పందిస్తూ విమర్శలు గుప్పించారు. ఏపీలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ ఏ మేరకు ప్రభావం చూపుతుందనే విషయంలో బీజేపీ పెద్దలకు క్లారిటీ ఉందని పేర్కొన్నారు. టీడీపీ మీద బీజేపీ నేతలు ఎటువంటి ఆశలు పెట్టుకోవడంలేదని చెప్పుకొచ్చారు.

Also Read: రెండు వర్గాలుగా చీలిన జనసేన పార్టీ నాయకులు..!

కనీసం ఒక్క స్థానంలోనైనా టీడీపీ జెండా ఎగురుతుందని చెప్పినా బీజేపీ నమ్మదని స్థితిలో లేదన్నారు. టీడీపీ శక్తిసామర్థ్యాలు ఏ పాటివనే విషయం బీజేపీకి అర్థమైయిందన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో తను సొంతంగా 370 సీట్లు గెలుచుకోవాలని బీజేపీ లక్ష్యంగా నిర్ణయించుకున్న విషయాన్ని గుర్తు చేశారు.

అదే విధంగా NDA కూటమి 400 చోట్ల విజయం సాధించాలని టార్గెట్ పెట్టుకుందన్నారు. ఇందులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే నేతృత్వంలోని శివసేన పార్టీ, ఎన్సీపీ, జేడీయూ, ఆర్ఎల్డీ, ఎల్జేపీతో పాటు టీడీపీ, జనసేన పార్టీలకు 30 లోక్ సభ సీట్లు వస్తాయని కేంద్రంలోని బీజేపీ పెద్దల అభిప్రాయమని చెప్పుకొచ్చారు. అయితే, ఇందులో టీడీపీ, జనసేనల వాటా మాత్రం సున్నా అని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు