MP Vijaysai Reddy : హోంమంత్రి రాజీనామా చేయాలి.. విజయసాయిరెడ్డి డిమాండ్

AP: హోంమంత్రి మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప దాటడం లేదని YCP MP విజయసాయిరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, నేరాలకు బాధ్యత తీసుకుంటూ హోంమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

New Update
MP Vijaysai Reddy : హోంమంత్రి రాజీనామా చేయాలి.. విజయసాయిరెడ్డి డిమాండ్

MP Vijaysai Reddy Demand : రాష్ట్ర హోంమంత్రి మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప దాటడం లేదని YCP MP విజయసాయిరెడ్డి (Vijaysai Reddy) విమర్శించారు. 'బొల్లి మాటలతో కాలక్షేపం చేయడం వల్లనే రాష్ట్రం భయం గుప్పిట్లోకి వెళ్లిపోయింది. బయటకు వస్తే ఏమవుతుందో తెలియని దారుణ స్థితి ఉంది. దీనికి బాధ్యత వహించి హోంమంత్రి రాజీనామా చేయాలి. హత్యలు జరగకుండా చూడడంలో కూటమి ప్రభుత్వం (NDA Government) విఫలమైంది. ప్రభుత్వ వైఫల్యంపై గవర్నర్ విచారణకు ఆదేశించాలి' అని డిమాండ్ చేశారు.

Also Read : ఒలింపిక్స్‌లో బోణీ కొట్టిన భారత్‌.. షూటింగ్‌లో మను బాకర్‌కు కాంస్యం


Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో రాబోయే 2 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు.

New Update
Rains

Rains

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో రాబోయే రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు వర్ష సూచన ఉంది. అటు ఆంధ్రప్రదేశ్‌లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment