Kodali Nani: చంద్రబాబుది వెన్నుపోటు జీవితం.. కొడాలి నాని హాట్ కామెంట్స్ AP: చంద్రబాబుది వెన్నుపోటు జీవితం, 420 చరిత్ర అని విమర్శలు చేశారు కొడాలి నాని. చేసిన వాగ్దానాలను చంద్రబాబు ఏ రోజైనా నిలబెట్టుకున్నాడా? అని ప్రశ్నించారు. పేద ప్రజల అభివృద్ధికి సీఎం జగన్ కష్టపడుతుంటే రాష్ట్రం శ్రీలంక అవుతుందని చంద్రబాబు అంటున్నారని ఫైర్ అయ్యారు. By V.J Reddy 05 May 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Kodali Nani: వైసీపీ స్థాపించిన తర్వాత జగన్ చేసిన ప్రతి పోరాటం... ప్రతి కష్టం... ప్రతి విషయంలో ఎస్సీ సోదరులు అండగా తోడుగా నిలబడ్డారని అన్నారు కొడాలి నాని. అనేక పరిస్థితుల్లో ఎస్సీ సామాజిక వర్గం సీఎం జగన్ కు మద్దతుగా నిలిచారని అన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ అంతా కలిసి సీఎం జగన్ ను ఓడించాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. నా ఎస్సీలు... నా ఎస్టీలు... నా బీసీలు...నా మైనార్టీలు... అని సీఎం జగన్ ఎప్పుడూ చెబుతారని వ్యాఖ్యానించారు. ALSO READ: నువ్వు కట్టుకుంటావా చీర లేదా రాహుల్ గాంధీకి కట్టిస్తావా?.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ విమర్శలు ఇప్పుడు అదే ఎస్సీ...ఎస్టీ... బీసీ... మైనార్టీలు సీఎం జగన్ ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని.. సీఎం జగన్ ఐదేళ్ల పాలనలో రెండు లక్షల 57 వేల కోట్లతో పేద వర్గాల అభివృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు. పేదల పిల్లల విద్యకు.. పేద వర్గాల ఆరోగ్య భద్రతకు ఎన్నో చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. దేశంలో ఎవరూ చేయని విధంగా సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల కంటే..... ఇంకా ఎక్కువ చేస్తామని చంద్రబాబు దొంగ వాగ్దానాలు చేస్తున్నాడని విమర్శించారు. పేద ప్రజల అభివృద్ధికి సీఎం జగన్ కష్టపడుతుంటే.... రాష్ట్రం శ్రీలంక అవుతుందని చంద్రబాబు అన్నారని ఫైర్ అయ్యారు. చేసిన వాగ్దానాలను చంద్రబాబు ఏ రోజైనా నిలబెట్టుకున్నాడా ? అని ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని అన్నారు. చంద్రబాబు జీవితమే వెన్నుపోటు జీవితం... 420 చరిత్ర అని మండిపడ్డారు. రాష్ట్రంలో గాని...గుడివాడలో గాని... నూటికి 90 శాతం ఎస్సీ కమ్యూనిటీ మా విజయాల్లో భాగమయ్యారు..... నేను గాని... వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గాని.... సీఎం జగన్ గానీ.... మీ రుణాన్ని 100 జన్మలనెత్తిన తీర్చుకోలేం అని అన్నారు. #chandrababu #cm-jagan #kodali-nani మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి