YS Jagan: ఏపీలో రెడ్ బుక్ పాలన.. ప్రభుత్వంపై జగన్ ఫైర్

AP: కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు జగన్. రాష్ట్రవ్యాప్తంగా రెడ్ బుక్ పాలన జరుగుతుందని అన్నారు. రాళ్లు, రాడ్లు, కత్తులతో గ్రామంలో దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని అన్నారు.

New Update
YS Jagan: ఏపీ హైకోర్టులో జగన్ పిటిషన్

YS Jagan: నంద్యాలలో ఇటీవల హత్యకు గురైన వైసీపీ నేత సుబ్బారాయుడి కుటుంబానికి పరామర్శించారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా రెడ్ బుక్ (Red Book) పాలన సాగిస్తున్నారని కూటమి ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు. ఊళ్లలో ఆధిపత్యం కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని అన్నారు. రాళ్లు, రాడ్లు, కత్తులతో గ్రామంలో దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని అన్నారు.

మన ప్రభుత్వం ఉంటే..

రాష్ట్రంలో ఆరాచక పాలన జరుగుతుందని అన్నారు. సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) మహిళలను మోసం చేశారని చెప్పారు. ప్రతి విద్యార్థికి రూ. 15 వేలు ఇస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారని అన్నారు. ఎన్నికల సమయంలో మాయ మాటలు చెప్పారని.. మన ప్రభుత్వమే ఉండి ఉంటే ఇప్పటికే అందరికి రైతు భరోసా అందేది అని అన్నారు.

Also Read: మీ వివరణ తలా తోక లేనిది.. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రిపై షర్మిల ఫైర్!

Advertisment
Advertisment
తాజా కథనాలు