Pneumonia: పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడికి చూపించండి.. లేదంటే ప్రమాదమే..! చలికాలంలో చలి తీవ్రత పెరగడం, పొల్యూషన్ కారణంగా పిల్లలు, వృద్దుల్లో న్యుమోనియా సమస్య పెరిగే అవకాశం ఉంది. అందుకే.. న్యుమోనియా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పిల్లలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే.. వెంటనే వైద్యులకు చూపించాలి. By Shiva.K 12 Nov 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి World Pneumonia Day 2023: న్యుమోనియా చాలా తీవ్రమైనది. కాలుష్యం కారణంగా, చలికాలంలో న్యూమోనియా మరింత తీవ్రంగా మారుతుంది. ఫలితంగా చాలా మంది ప్రజలు ఆస్పత్రి పాలవుతుంటారు. అయితే, కొందరు న్యుమోనియాను జలుబుగా పొరబడుతారు. ఈ నిర్లక్ష్యం కారణంగా అదికాస్తా తీవ్రంగా పరిణమిస్తుంది. ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరుకుంటుంది. న్యుమోనియాకు అనేక కారణాలు ఉన్నాయి. ఇక న్యుమోనియాలో వివిధ లక్షణాలు కనిపిస్తాయి. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ నివేదిక ప్రకారం.. బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ అనే మూడు సూక్ష్మజీవుల వల్ల ఇన్‌ఫెక్షన్ రావచ్చు. న్యుమోనియా తీవ్రతరం అయినప్పుడు శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఇది కోవిడ్ 19, ఫ్లూ వంటి లక్షణాలను చూపుతుంది. అయితే తీవ్రమైన శ్వాస సమస్యలు సంభవించినప్పుడు.. అది న్యుమోనియాకు సంకేతం కావచ్చు. బాక్టీరియల్ న్యుమోనియా లక్షణాలు.. 1. అధిక జ్వరం. టెంపరేచర్ 105 వరకు చేరవచ్చు. 2. పసుపు, ఆకుపచ్చ లేదా రక్తపు కఫం. 3. విపరీతమైన అలసట. 4. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఊపిరి ఆడకపోవడం. 5. చెమట పట్టడం లేదా చాలా చల్లగా ఉండటం. 6. ఛాతీ నొప్పి, కడుపు నొప్పి ముఖ్యంగా దగ్గు లేదా శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన సమస్య. 7. ఆకలి లేకపోవడం. 8. చర్మం, గోర్లు లేదా పెదవులు నీలం రంగులోకి మారడం. 9. గందరగోళం. వైరల్ న్యుమోనియా లక్షణాలు.. 1. పొడి దగ్గు. 2. తలనొప్పి. 3. కండరాల నొప్పి. 4. అధిక అలసట, బలహీనత. పిల్లలలో న్యుమోనియా లక్షణాలు 1. జ్వరం, చలి, అసౌకర్యం, చెమటలు పట్టడం, చర్మం ఎర్రగా మారడం. 2. దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, భారీ శ్వాస. 3. వాంతులు, అలసట, శక్తి లేకపోవడం. 4. ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు స్వరంలో గురక. 4. మూత్రం తగ్గుదల. 5. మునుపటి కంటే ఎక్కువగా ఏడవటం. 6. తినడంలో ఇబ్బంది పడటం జరుగుతుంది. వృద్ధులలో న్యుమోనియా లక్షణాలు.. 1. మానసిక స్థితిలో ఆకస్మిక మార్పు. 2. ఆకలి లేకపోవడం. 3. చాలా అలసట. న్యుమోనియా వచ్చే ప్రమాదం ఎవరికి ఎక్కువగా ఉంటుంది? 1. 65 ఏళ్లు పైబడిన, 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు న్యుమోనియా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 2. గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు లేదా ఆస్తమా ఉన్నవారు. 3. ఆహారం మింగడానికి ఇబ్బంది పడే వ్యక్తులు. పార్కిన్సన్స్, స్ట్రోక్, డిమెన్షియా ఉన్న వ్యక్తులు. 4. ఎక్కువ కాలం ఆసుపత్రిలో ఉన్న వ్యక్తులు. 5. ధూమపానం చేసే వ్యక్తులు. 6. గర్భిణీ స్త్రీలు. 7. రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న వ్యక్తులు. ఫ్లూ, న్యుమోనియా మధ్య వ్యత్యాసం.. జలుబు-ఫ్లూ లక్షణాలు, న్యుమోనియా లక్షణాలు చాలా వరకు ఒకే విధంగా ఉంటాయి. అందుకే.. ఈ తేడాను గుర్తించడం కష్టంగా ఉంటుంది. అయితే, న్యుమోనియా చాలా త్వరగా ప్రాణాలకు ముప్పు కలిగిస్తుంది. ఈ పరిస్థితిలో వీలైనంత త్వరగా ఆసుపత్రిలో చూపించాల్సి ఉంటుంది. అయితే, న్యుమోనియా విషయంలో కొన్ని లక్షణాలు జలుబు, ఫ్లూకి భిన్నంగా ఉండవచ్చు. న్యుమోనియా ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. ఇది సాధారణంగా ఫ్లూ కంటే తక్కువగా ఉంటుంది. న్యుమోనియాలో.. జ్వరం చాలా ఎక్కువగా ఉంటుంది. పసుపు లేదా ఆకుపచ్చ కఫం వస్తుంది. ఉమ్మి వేస్తే శ్లేష్మం బయటకు వస్తుంది. న్యుమోనియా పట్ల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. Also Read: మంత్రి కేటీఆర్‌కు రూ. లక్ష చెక్కు అందజేసిన శంకరమ్మ.. తెలంగాణ ఎన్నికల బరిలో యంగ్ లీడర్స్ వీరే.. #world-pneumonia-day-2023 #child-health-care-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి