World Cup Semis: భారత్-న్యూజీలాండ్ టీమ్స్ లో మ్యాచ్ ను మలుపు తిప్పగలిగే సత్తా వీరిదే! 

వరల్డ్ కప్ 2023 మొదటి సెమీఫైనల్స్ లో  గేమ్ ఛేంజర్స్ గా భారత్ నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, సిరాజ్ అలాగే కివీస్ నుంచి కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ట్రెంట్ బౌల్ట్ లకు ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఈరోజు హీరోలుగా నిలుస్తారో వేచి చూడాల్సిందే 

New Update
World Cup Semis: భారత్-న్యూజీలాండ్ టీమ్స్ లో మ్యాచ్ ను మలుపు తిప్పగలిగే సత్తా వీరిదే! 

World Cup Semis: వరల్డ్ కప్ 2023 మొదటి సెమీస్ కొద్దిగంటల్లో ప్రారంభం కాబోతోంది. టీమిండియా కివీస్ తో తలబడబోతోంది. ఇప్పటికే ఈ మ్యాచ్ పై ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఉత్సుకతతో ఉన్నారు. భారత్ ఈ మ్యాచ్ లో న్యూజీలాండ్ పై గెలిచి ఫైనల్స్ దూసుకువెళుతుందా? లేదా?  అనే టెన్షన్ లో భారత క్రికెట్ అభిమానులు ఉన్నారు. హోరాహోరీ పోరు తప్పదని భావిస్తున్న ఈ మ్యాచ్ కోసం రెండు టీమ్స్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాయి. అయితే, మ్యాచ్ గమనాన్ని మార్చేసే శక్తి ఉన్న ఆటాగాళ్ళు రెండు టీమ్స్ లోనూ కొందరు ఉన్నారు. అవసరం అయితే ఒంటి చేత్తో పరాజయం అంచునుంచి విజయం వైపు జట్టును డ్రైవ్ చేయగలిగిన గేమ్ ఛేంజర్స్ ఎవరు ఉన్నారో తెలుసుకుందాం. 

భారత్ గేమ్ ఛేంజర్స్.. 

  1. రోహిత్ శర్మ

ఏవరేజ్: 55 స్ట్రైక్ రేట్: 121 

World Cup Semis: భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ క్రీజులోకి రాగానే మ్యాచ్ టోన్ సెట్ చేస్తాడు. క్రీజులో ఉన్నంత సేపు ఎటాక్ చేస్తూనే ఉంటాడు. ఒక్కోసారి రిస్క్ తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడడు.. అయినా స్థిరంగా ఉంటాడు. అతని సగటు 55 పైన ఉంది. అది కూడా 121 స్ట్రైక్ రేట్‌తో.

న్యూజీలాండ్ తో ఇలా.. రోహిత్ తన ప్రపంచ కప్ కెరీర్‌లో న్యూజిలాండ్‌తో ఆడిన 2 మ్యాచ్‌లలో 23.50 సగటుతో -106.81 స్ట్రైక్ రేట్‌తో 47 పరుగులు చేశాడు. 

రోహిత్ ఈ  ప్రపంచ కప్ లో  మొత్తం 9 మ్యాచ్ లు ఆడాడు. వీటిలో 55.88 ఏవరేజ్ తో 503 పరుగులు చేశాడు. రోహిత్ స్ట్రైక్ రేట్ 121.49. ఒక సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు రోహిత్ ఎకౌంట్ లో ఉన్నాయి. 

ఇక న్యూజీలాండ్ తో రోహిత్ శర్మ మొత్తం తన కెరీర్ లో ఇప్పటివరకూ 28 మ్యాచ్ లు ఆడి 935 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. న్యూజీలాండ్ కు వ్యతిరేకంగా రోహిత్ స్ట్రైక్ రేట్ 83.40

  1. విరాట్ కోహ్లీ

కోహ్లీ బ్యాట్ ఇప్పుడు పరుగుల దాహంతో ఉంది. ఈ వరల్డ్ కప్ లో ప్రత్యర్థి ఎవరైనా సరే ఎంత మంచి బాల్ అయినాసరే.. దానిని శిక్షించడంలో కోహ్లీ బ్యాట్ ఎక్కడ రాజీపడలేదు. కోహ్లి ప్రస్తుత ప్రపంచకప్‌లో 99.00 సగటుతో 5 అర్ధసెంచరీలు, 2 సెంచరీల సాయంతో 594 పరుగులు చేశాడు. అతను టోర్నమెంట్‌లోని 9 ఇన్నింగ్స్‌లలో 7మ్యాచ్ ల్లో  50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేశాడు. 

కింగ్ కోహ్లీ  కివీస్‌తో జరిగిన 2 ప్రపంచ కప్ మ్యాచ్‌లలో 48.00 సగటుతో 96 పరుగులు చేశాడు. ఈ ప్రపంచకప్‌లో ధర్మశాలలో జరిగిన మ్యాచ్ లో  95 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.

కోహ్లీ న్యూజీలాండ్ పై మొత్తమే 30 వన్డే ఇన్నింగ్స్ ఆడాడు. వీటిలో 56.6 ఏవరేజ్ తో మొత్తం 1528 పరుగులు చేశాడు. న్యూజీలాండ్ కు వ్యతిరేకంగా కోహ్లీ స్ట్రైక్ రేట్ 95. 1గా ఉంది. కివీస్ పై కొహ్లీ అత్యుత్తమ స్కోర్ 154 నాటౌట్ కావడం గమనార్హం. 

  1. జస్ప్రీత్ బుమ్రా

ఈ వరల్డ్ కప్ లో జస్ప్రీత్ బుమ్రా తన బౌలింగ్ తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్నారు. లీగ్ మ్యాచ్ లలో 17 వికెట్లు తీశాడు. అతని ఎకానమీ రేటు కేవలం 3.65. అంటే ఎంత పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడో అర్ధం చేసుకోవచ్చు. 

మొత్తంగా చూసుకుంటే న్యూజీలాండ్ పై ఇప్పటివరకూ 12 ఇన్నింగ్స్ ఆడాడు బుమ్రా. ఓవరాల్ గా 4.69 ఏవరేజ్ తో 564 పరుగులిచ్చి 14 వికెట్స్ తీశాడు. 

  1. మహ్మద్ సిరాజ్

మహ్మద్ సిరాజ్ ఇప్పటి వరకు ఈ వరల్డ్ కప్ లో ఆడిన 9 లీగ్ మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టాడు. అతను 5.20 ఎకానమీతో బౌలింగ్ చేస్తున్నాడు. సిరాజ్, బుమ్రాతో కలిసి పవర్‌ప్లేలో బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచుతున్నాడు. ఈ టోర్నీ పవర్‌ప్లేలో అతను 7 వికెట్లు పడగొట్టాడు.

Also Read: రోహిత్ ఇలా, కేన్ అలా..సెమీస్ కు రెడీ అయిన కెప్టెన్లు

న్యూజిలాండ్ గేమ్ ఛేంజర్స్.. 

  1. కేన్ విలియమ్సన్

న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయం కారణంగా ప్రస్తుత ప్రపంచకప్‌లో కేవలం 3 మ్యాచ్‌లు మాత్రమే ఆడగలిగాడు. విలియమ్సన్ ఈ ప్రపంచకప్‌లో 93.50 సగటుతో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆడిన మూడు మ్యాచ్ లలోనూ  2 హాఫ్ సెంచరీల  సహాయంతో 187 పరుగులు చేశాడు.

విలియమ్సన్ 2019 సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌తో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్‌లో 70.52 స్ట్రైక్ రేట్‌తో 67 పరుగులు చేశాడు.

  1. రచిన్ రవీంద్ర

రచిన్ రవీంద్ర ఈ ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆర్డర్‌కు వెన్నెముకగా నిలిచాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో రచిన్‌కు మూడు సెంచరీలు ఉన్నాయి. అతను 2 హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్‌ కూడా ఆడాడు. రాచిన్ 70.62 సగటుతో -108.44 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేస్తున్నాడు.

ప్రపంచకప్‌లో భారత్‌పై రాచిన్ ప్రదర్శన బాగానే ఉంది. ధర్మశాలలో జరిగిన ఏకైక మ్యాచ్‌లో అతను 86.20 స్ట్రైక్ రేట్‌తో 75 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.

  1. మిచెల్ సాంట్నర్

భారత్‌లోని స్పిన్నర్‌కు అనుకూలమైన పిచ్‌లపై ఆ జట్టు టాప్‌ వికెట్‌ టేకర్‌ మిచెల్‌ సాంట్నర్‌ సమర్థవంతంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. మొత్తం 9 లీగ్ మ్యాచ్‌ల్లో సాంట్నర్ 16 వికెట్లు తీశాడు. అతని ఎకానమీ రేట్  కూడా 5 కంటే తక్కువగా ఉంది.

ప్రపంచ కప్‌లో సాంట్నర్ 3.55 ఎకానమీతో భారత్‌పై బౌలింగ్ చేశాడు.  2 మ్యాచ్‌ల్లో 3 బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేశాడు.

  1. ట్రెంట్ బౌల్ట్

న్యూజిలాండ్ పేస్ అటాక్‌లో ముఖ్యమైన భాగం ట్రెంట్ బౌల్ట్. పవర్‌ప్లేలో వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచుతున్నాడు.  ప్రపంచ కప్-2023 పవర్‌ప్లేలో బోల్ట్ 6 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రపంచకప్‌లో లీగ్ మ్యాచ్‌ల్లో అతని పేరిట 13 వికెట్లు ఉన్నాయి.

ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన 2 మ్యాచ్‌ల్లో బోల్ట్ 3 వికెట్లు పడగొట్టాడు. అతని కానమీ 5.10గా ఉంది. 

ఈరోజు జరగబోయే మ్యాచ్ లో వీరంతా ఎలా రాణిస్తారనే దానిపై మ్యాచ్ ఫలితం ఉంటుంది అనడంలో డౌట్ లేదు. మరి మ్యాచ్ లో వీరి మ్యాజిక్ ఎలా ఉంటుందో చూడాలి. 

Watch this Interesting Video:

Advertisment
Advertisment
తాజా కథనాలు