World Cup Finals: కొత్త చరిత్ర సృష్టించిన ఫైనల్ మ్యాచ్.. ఎంత మంది చూశారంటే..

ఆస్ట్రేలియా-టీమిండియాల మధ్య ఆదివారం జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూడటానికి ప్రజలు ఎగబడ్డారు. అన్ని పనులూ పక్కన పెట్టి టీవీలకు అతుక్కుపోయారు. దీంతో ఓటీటీలో ఈ మ్యాచ్ వీక్షకుల సంఖ్య 5.9 కోట్లకు చేరి సరికొత్త రికార్డ్ సృష్టించింది. 

New Update
World Cup Finals: కొత్త చరిత్ర సృష్టించిన ఫైనల్ మ్యాచ్.. ఎంత మంది చూశారంటే..

World Cup Finals: టీమిండియా మ్యాచ్ ఆడుతుంది అంటే అభిమానులకు ఒకరకంగా ఉండదు. అందులోనూ వరల్డ్ కప్.. అదీ ఫైనల్ మ్యాచ్.. ఇంతకన్నా పండగ చేసుకోవడానికి కారణం ఏముంటుంది చెప్పండి. ఆదివారం.. భారత్-ఆసీస్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ చూడటానికి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ గ్రౌండ్ కి సునామీలా వచ్చి చేరారు ప్రజలు. ఇక ఇదే మ్యాచ్ ను చూడటానికి టీవీల ముందు కోట్లాది మంది చేరిపోయారు. టీమిండియా గెలవాలని.. కోరుకుంటూ దేశవ్యాప్తంగా టీవీలకు అతుక్కుపోయారు.. ఆదివారం ఉదయం నుంచే వరల్డ్ కప్ ఫైనల్ ఫీవర్ కనిపించింది. రోడ్లన్నీ ఖాళీగా కనిపించాయి. ఇంటిదగ్గర.. బార్లు.. పెద్ద స్క్రీన్స్ ఏర్పాటు చేసిన స్టేడియమ్స్ ఎక్కడ అవకాశం ఉంటె అక్కడ అభిమానులు చేరిపోయారు. ఈ క్రమంలో వీక్షకుల పరంగా కొత్త చరిత్ర సృష్టించింది ఈ ఫైనల్ మ్యాచ్. 

ఆదివారం భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన ప్రపంచకప్ ఫైనల్(World Cup Finals)మ్యాచ్ వీక్షకుల రికార్డులన్నీ బద్దలుకొట్టింది. ఒక సమయంలో, OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 5.9 కోట్ల మందికి పైగా ప్రజలు దీన్ని ప్రత్యక్షంగా వీక్షించారు.

ఇప్పటివరకు, ఎప్పుడూ ఇంత మంది ప్రజలు OTTలో ఏ క్రికెట్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడలేదు. అయితే మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయావకాశాలు పెరుగుతున్న తరుణంలో వీక్షకుల సమాఖ్య బాగా తగ్గింది. టీమిండియా కనుక గెలిచే పరిస్థితి ఉంటె కనుక ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉండేది. 

Also Read: టీమిండియా ఓడిపోవడంతో.. వెక్కి వెక్కి ఏడ్చిచిన బాలుడు.. వీడియో వైరల్

ఈ ప్రపంచకప్‌లో నవంబర్ 15న జరిగిన భారత్, న్యూజిలాండ్ సెమీ-ఫైనల్ మ్యాచ్‌ను OTTలో దాదాపు 5.3 కోట్ల మంది వీక్షించారు. ఇక ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు దాదాపు 1.3 లక్షల మంది ప్రేక్షకులు హాజరయ్యారు.

వీక్షకుల సంఖ్యను పెంచుకోవడానికి.. 

 ప్రపంచ కప్ మ్యాచ్‌ల ప్రసార హక్కులు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ఉన్నాయి. ఇది కాకుండా, అభిమానులు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారాన్ని చూసే అవకాశం కల్పించారు. OTT ప్లాట్‌ఫారమ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ జూన్ 9న వినియోగదారులు ఆసియా కప్ 2023 -ICC పురుషుల క్రికెట్ ODI ప్రపంచ కప్ 2023 అన్ని మ్యాచ్‌లను యాప్‌లో ఉచితంగా చూడొచ్చని ప్రకటించింది. 

హాట్‌స్టార్ తన వీక్షకుల సంఖ్యను పెంచుకోవడానికి ముఖేష్ అంబానీకి చెందిన  జియో సినిమా పద్ధతిని ప్రయత్నిస్తోంది. ఇలా చేయడం ద్వారా డిస్నీ + హాట్‌స్టార్ భారతదేశంలో జియో సినిమా ను ఛాలెంజ్ చేయాలనుకుంటున్నారు. Jio సినిమా IPL 2023 అన్ని మ్యాచ్‌లను ఉచితంగా ప్రదర్శించింది.  దీని కారణంగా కంపెనీకి రికార్డ్ వీక్షకుల సంఖ్య వచ్చింది.

Watch this interesting Video:

Advertisment
Advertisment
తాజా కథనాలు