World Cup Finals: క్రికెట్ ఫైనల్స్ ఫీవర్..విమానం టికెట్ రేట్ల రాకెట్ స్పీడ్..లక్షల్లో హోటల్ గది..

భారత్ ఆడుతున్నసాధారణ క్రికెట్ మ్యాచ్ అంటేనే అభిమానుల హంగామా మామూలుగా ఉండదు. మరి వరల్డ్ కప్ ఫైనల్ అంటే.. ఆ ఫీవర్ వేరే లెవెల్ కదా. అహ్మదాబాద్ లో ఆదివారం జరిగే ఫైనల్స్ కోసం విమాన టికెట్ల రేట్లు ఆరు రెట్లు పెరిగాయి. లగ్జరీ హోటల్ గది అద్దె 2 లక్షల వరకూ చేరుకుంది.

New Update
World Cup Finals: క్రికెట్ ఫైనల్స్ ఫీవర్..విమానం టికెట్ రేట్ల రాకెట్ స్పీడ్..లక్షల్లో హోటల్ గది..

World Cup Finals: ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా.. వరల్డ్ కప్ ఫైనల్స్ కి చేరిన టీమిండియా ఆదివారం ఆస్ట్రేలియాను ఢీ కొట్టబోతోంది. అహ్మదాబాద్ వేదికగా ఫైనల్స్ జరగబోతోంది. ఫైనల్స్ చూడటం కోసం ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరు కానున్నారని చెబుతున్నారు. ఇక క్రికెట్ అభిమానుల సందడికి హద్దే లేకుండా పోయింది. ఈసారి భారత్ కప్ కచ్చితంగా కొడుతుందని అందరూ నమ్ముతున్నారు. అందుకే గ్రౌండ్ లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్ ను చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ ఇప్పటికే సందడిగా మారిపోయింది. మ్యాచ్ చూడటం కోసం దూర ప్రాంతాల నుంచి కూడా అభిమానులు వచ్చేస్తున్నారు. దీంతో విమాన టికెట్ల ధరలు రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాయి.

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ -2023 (నవంబర్ 18) ఫైనల్(World Cup Finals) ఒక రోజు ముందు అహ్మదాబాద్ వెళ్లే విమానాలలో ఒకవైపు ప్రయాణానికి టికెట్ల ధర 6-7 రెట్లు పెరిగింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల నుంచి అహ్మదాబాద్ కు ఛార్జీలు 30 వేలు దాటాయి. నవంబర్ 19న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కారణంగా ఇండిగో శనివారం బెంగళూరు నుంచి అహ్మదాబాద్ కు ఆరు డైరెక్ట్ విమానాలను నడుపుతోంది. మార్నింగ్ టికెట్ ధర రూ.30,999 నుంచి ప్రారంభమౌతోంది. సాధారణ రోజుల్లో బెంగళూరు నుంచి అహ్మదాబాద్ కు వన్ వే ఫ్లైట్ టికెట్ ధర రూ.5,700 నుంచి ప్రారంభమవుతుంది.
భారత్-ఆస్ట్రేలియా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు శనివారం రాత్రి 9 గంటలకు బెంగళూరు నుంచి అహ్మదాబాద్ వెళ్లేందుకు ఇండిగో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకునేందుకు చాలా డబ్బు ఖర్చు అయిందని ఒక అభిమాని తెలిపాడు. ఈ టికెట్ ను రూ.32,999కు ఇతను దక్కించుకున్నాడు. ఇతనితో పాటు చాలా మంది ఖరీదైన టికెట్లు బుక్ చేసుకున్నారు. టికెట్ ధర అమాంతం పెరిగిపోయినా డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు.

Also Read:  టీమిండియా పాలిట శని.. ఆ అంపైర్‌ ఉన్నప్పుడు ఒక్కసారి కూడా గెలవలేదు..!

ఇక అహ్మదాబాద్ పొరుగు జిల్లా వడోదరలో కూడా టికెట్ ధర ఎక్కువగా ఉంది. వడోదర నుంచి రోడ్డు మార్గం ద్వారా అహ్మదాబాద్ కు సుమారు రెండు గంటల్లో చేరుకోవచ్చు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు నుంచి వడోదరకు విమాన ఛార్జీలు రూ.20,000-25,000కు చేరుకున్నాయి.

హోటల్ గదిలో అద్దె రెండు లక్షలు..

అహ్మదాబాద్ లో 4 స్టార్, 5 స్టార్, 7 స్టార్ వంటి లగ్జరీ హోటళ్ల అద్దె కూడా రూ.2 లక్షలకు చేరుకుంది. సాధారణంగా వీటి అద్దె రూ.20-25 వేలు ఉంటుంది. అదే సమయంలో సాధారణ హోటల్ అద్దె కూడా రూ.10,000కు పెరిగింది. సాధారణ సమయంలో ఇది 2 వేలకు కాస్త అటూ ఇటూగా ఉంటుంది.

ఐటీసీ హోటల్స్ పన్నులు మినహాయించి రూ.96,300, మారియట్ రూ.64,000, బ్లూమ్ సూట్స్ ఒక్కో గదికి రూ.43,000 వసూలు చేస్తున్నాయి. చాలా హోటళ్లలో బుకింగ్స్ ఫుల్ అయ్యాయి.

Watch this interesting Video:

Advertisment
Advertisment
తాజా కథనాలు