Fight in Metro Rail: మెట్రో రైల్లోనే జుట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళలు..కారణం తెలిస్తే ముక్కున వేలు వేసుకోవాల్సిందే!! మెట్రో రైలు రయ్యి..రయ్యి మంటూ పోతుంది. అందులో ఉన్న ఇద్దరు మహిళలు మాత్రం బూతులు తిట్టుకుంటూ.. చెలరేగిపోయారు. అంతటితో ఆగని వాళ్ళు.. ఏకంగా జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. అందులోని జనం వాళ్ళను అడ్డుకున్నా.. వినకుండా తన్నుకున్నారు. ఇదంతా బానే ఉంది. ఇక దీన్ని అదే ట్రైన్ లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త ఫుల్ వైరల్ అయింది. దీన్ని లక్షల మంది చూశారు. వేల మంది లైక్ కొట్టారు.. By P. Sonika Chandra 17 Aug 2023 in నేషనల్ New Update షేర్ చేయండి Fight in Metro Rail: మెట్రో రైలు రయ్యి..రయ్యి మంటూ పోతుంది. అందులో ఉన్న ఇద్దరు మహిళలు మాత్రం బూతులు తిట్టుకుంటూ.. చెలరేగిపోయారు. అంతటితో ఆగని వాళ్ళు.. ఏకంగా జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. అందులోని జనం వాళ్ళను అడ్డుకున్నా.. వినకుండా తన్నుకున్నారు. ఇదంతా బానే ఉంది. ఇక దీన్ని అదే ట్రైన్ లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త ఫుల్ వైరల్ అయింది. దీన్ని లక్షల మంది చూశారు. వేల మంది లైక్ కొట్టారు. ఈ సంఘటన ఢిల్లీ మెట్రో రైల్లో చోటుచేసుకుంది. ఇంతకీ వాళ్ల మధ్య గొడవ దేనికంటే..! మెట్రో రైలు ప్రయాణికులతో కిక్కిరిసి ఉంది. అందులో నిలబడడానికి కూడా సరిగ్గా ప్లేస్ లేదు. ఇంతలో అందులోకి ఇద్దరు మహిళలు ఎక్కారు. ఈ క్రమంలో ఓ మహిళను కాస్త జరుగూ.. నేను నిలబడుతా.. అని మరో మహిళ అడిగింది. దీంతో ఆ నాకే నిలబడడానికి స్థలం లేదు.. నీకు ఎక్కడి నుంచి ఇవ్వాలని ర్యాష్ గా ఆ మహిళ సమాధానం చెప్పింది. అంతే ఈ మాటే.. వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది. ఈ క్రమంలో ఇద్దరు గట్టి గట్టిగా తిట్టుకున్నారు. బూతులు తిట్టుకుంటూ.. ఒకరినొకరు నెట్టుకున్నారు. చివరికి జుట్లు పట్టుకొని అందరి ముందే కొట్టుకున్నారు. తోటి ప్రయాణికులు పోనివ్వండని.. చెబుతున్నా పట్టించుకోకుండా పబ్లిక్ ప్లేస్ లో రెచ్చిపోయారు. ఇక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్రమంలో నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. జట్లు ఒక దగ్గర ఉంటాయేమో కాని రెండు జుట్లు మాత్రం ఒక దగ్గర ఉండవన్న సామెతను ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి