తెలంగాణలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ.. సీఎం కేసీఆర్ పై ఏకంగా 81 మంది పోటీ! నామినేషన్ల ఉపసంహరణ తర్వాత తెలంగాణ తుది జాబితా వచ్చేసింది. 119 నియోజకవర్గాల్లో అందరి ఫోకస్ గజ్వేల్, కామారెడ్డిపైనే ఉంది. రెండు నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలు నామినేషన్లు వేశారు. మొత్తానికి గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో కేసీఆర్ తో మొత్తం 83మంది బరిలో ఉన్నట్లు తేలింది. By Bhoomi 15 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి నామినేషన్ల ఉపసంహరణ తర్వాత తెలంగాణ తుది జాబితా వచ్చేసింది. 119 నియోజకవర్గాల్లో అందరి ఫోకస్ గజ్వేల్, కామారెడ్డిపైనే ఉంది. ఆ రెండు నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలు నామినేషన్లు వేశారు. అక్కడే ఉపసంహరణలు కూడా అధికంగానే ఉన్నాయి. ఫైనల్ గా పోటీపడే ప్రత్యర్థులు కూడా ఆ రెండు నియోజకవర్గాల్లోనే ఉండటం విశేషం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి గజ్వేల్ తోపాటుగా కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్నారు. దీంతో ఆ రెండు నియోజకవర్గాలు రాష్ట్రంలోనే హాట్ టాపిగ్గా మారాయి. గజ్వేల్లో స్క్రూటీని తర్వాత 114మంది బరిలో ఉన్నారు. వారిలో 70మంది తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారు. దీంతో చివరికి అక్కడ బరిలో నిలిచిన వారి సంఖ్య 44దగ్గర ఆగింది. అందులో కేసీఆర్ ఒకరు ఉండగా..ఈటల రాజేందర్ తో కలిపి ఆయన ప్రత్యర్థులు 43 మంది ఉన్నారు. ఇక కామారెడ్డిలో స్క్రూటినీ తర్వాత 58మంది అభ్యర్థులు బరిలో దిగారు. వారిలో 19మంది నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నారు. చివరికి 39మంది బరిలో దిగారు. అంటే కేసీఆర్ మినహా మిగతావారి సంఖ్య 38. వారిలో రేవంత్ రెడ్డి కూడా ఒకరు. మొత్తానికి గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో కేసీఆర్ తో మొత్తం 83మంది బరిలో ఉన్నట్లు తేలింది. అంటే ఈరెండు నియోజవర్గాల్లో కేసీఆర్ ప్రత్యర్థులు 81 మంది ఉన్నారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో 15స్థానాలకు 312 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ 15 స్థానాల పరిధిలో కేవలం 20 మంది అభ్యర్థులు నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నారు. ఇది కూడా చదవండి: హైదరాబాద్ లోని ఆ ఏరియాల్లో ఇళ్లకు ఫుల్ డిమాండ్.. ఎగబడి కొంటున్న జనం! #telangana-election-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి