Ponnam Prabhakar: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి పొన్నం

TG: త్వరలోనే ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ ఉద్యోగులకు 21 శాతం డీఏ ఇచ్చామని చెప్పారు. రూ.280 కోట్ల బకాయిల్లో రూ.80 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. మిగిలిన రూ.200 కోట్లను నెలాఖరులోగా చెల్లిస్తాం అని అన్నారు.

New Update
Ponnam Prabhakar: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి పొన్నం

Minister Ponnam Prabhakar: రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుతామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కొత్తగా 1000 బస్సులు కొన్నామని, మరో 1500 బస్సులకు ఆర్డర్‌ ఇచ్చినట్లు చెప్పారు. దసరాలోపు నల్గొండ జిల్లాకు 30 ఎక్స్‌ప్రెస్‌, 30 లగ్జరీ బస్సులు ఇస్తామన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టీసీ ఉద్యోగులకు 21 శాతం డీఏ ఇచ్చామని చెప్పారు. రూ.280 కోట్ల బకాయిల్లో రూ.80 కోట్లు చెల్లిచినట్లు చెప్పారు. మిగిలిన రూ.200 కోట్లను నెలాఖరులోగా చెల్లిస్తాం అని అన్నారు. ఆర్టీసీలో 3,035 ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి లగ్జరీ బస్సులు నడుపుతామన్నారు. అన్ని జిల్లా కేంద్రాల నుంచి ఏసీ బస్సులు ప్రారంభిస్తాం అని అన్నారు.

Also Read: జాబ్ క్యాలెండర్ పై రేవంత్ కీలక ప్రకటన.. పరీక్షల వాయిదాలపై ఏమన్నారంటే!

Advertisment
Advertisment
తాజా కథనాలు