TS: కవితకు బెయిల్ వస్తుందా..రాదా..? బీఆర్ఎస్ లో ఆందోళన..! ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై ఇవాళ ఢిల్లీ హైకోర్ట్ తీర్పు ఇవ్వనుంది. ట్రయల్ కోర్ట్ బెయిల్ నిరాకరించడంతో కవిత హైకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. తీహార్ జైల్లో ఉన్న కవితకు కనీసం ఇవాళైనా బెయిల్ వస్తుందా..రాదా..అని బీఆర్ఎస్ లో టెన్షన్ కనిపిస్తోంది. By Jyoshna Sappogula 01 Jul 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత బెయిల్ పిటిషన్‌పై ఇవాళ ఢిల్లీ హైకోర్ట్ తీర్పు ఇవ్వనుంది. మధ్యాహ్నం 2.30గంటలకు తీర్పు ఢిల్లీ హైకోర్ట్ వెలువరించనుంది. లిక్కర్ కేసులో ట్రయల్ కోర్ట్ బెయిల్ నిరాకరించడంతో కవిత హైకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్ట్ ఇవాల్టికి తీర్పు రిజర్వ్ చేసింది. కవిత బెయిల్ పై జస్టిస్ స్వర్ణకాంతశర్మ తీర్పు ఇవ్వనున్నారు. ప్రస్తుతం తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితకు బెయిల్ వస్తుందా..రాదా..అని బీఆర్ఎస్ లో టెన్షన్ కనిపిస్తోంది. Also Read: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బిగ్ షాక్.. హైకోర్టులో ఎదురుదెబ్బ..! సీబీఐ అవినీతి కేసుతో పాటు ఈడీ మనీ లాండరింగ్ కేసులో కవిత బెయిల్ దరఖాస్తులను కొట్టివేస్తూ.. మే 6న ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టులో ఆమె సవాల్ చేశారు. ఈ కేసులోని 50మంది నిందితుల్లో కవిత ఒక్కరే మహిళని.. దీన్ని పరిగణనలోకి తీసుకొని బెయిల్ ఇవ్వాలని కవిత తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అయితే ఈ వాదనను సీబీఐ, ఈడీ వ్యతిరేకించాయి. ఈక్రమంలో కవితకు బెయిల్ వస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. #mlc-kavitha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి