MLC Jeevan Reddy: కేసీఆర్‌ దళితుణ్ని ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదు

సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదన్నారు. కేసీఆర్‌ క్యాబినెట్‌లో ఎంతమంది దళితులు ఉన్నారని ఆయన ప్రశ్నించారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు నిర్మించి ఇవ్వని కేసీఆర్‌కు ఓట్లు అడిగే హక్కులేదన్నారు.

New Update
MLC Jeevan Reddy: కేసీఆర్‌ దళితుణ్ని ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదు

సీఎం కేసీఆర్‌ దళితుణ్ని ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. కేసీఆర్‌ 2014లో ఇచ్చిన హామీలను సైతం నెరవేర్చలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ సమయంలోనే దళితుణ్ని ముఖ్యమంత్రి చేస్తానని కేసీఆర్‌ ప్రకటించారన్న ఆయన.. ఆ హామీని నెరవేర్చలేదన్నారు. అంతే కాకుండా 2018 ఎన్నికల ముందు పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు నిర్మించి ఇస్తామని హామి ఇచ్చారని గుర్తు చేశారు. 2018లో ఇచ్చిన హామీని సైతం నెవేర్చలేకపోయారని విమర్శించారు. కేసీఆర్‌ గతంలో ఎలాంటి హామీలు ఇచ్చారో గుర్తు చేసుకోవాలని సూచించారు.

కాంగ్రెస్‌పై రాద్దాంతం చేస్తున్న ఎమ్మెల్సీ క్వలకుంట్ల కవితపై మండిపడ్డ ఆయన.. బీఆర్‌ఎస్‌ క్యాబినెట్‌లో కూర్పు ఎలా ఉందో కవిత చెప్పాలని ఆయన ప్రశ్నించారు. వెనుకబడిన వర్గాల వారినిలో సీఎం తన మంత్రివర్గంలో ఎంతమందిని చేర్చుకున్నారో చెప్పాలన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చిందన్న జీవన్‌ రెడ్డి.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్ని గ్రామాల్లో డబుల్ బెడ్‌ రూమ్‌ ఇళ్లు నిర్మించి ఇచ్చిందొ చెప్పాలన్నారు.

కేసీఆర్‌ తన వైఫల్యాలను ఎత్తి చూపితే భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. గత 5 సంవత్సరాలుగా కేసీఆర్‌కు బీసీలు గుర్తు రాలేదన్న ఆయన.. ఎన్నికల సమయంలోనే బీసీలు గుర్తుకొస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లబ్దిదారులకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు నిర్మించి ఇవ్వని కేసీఆర్‌కు ఓట్లు అడిగే హక్కు లేదని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్‌ రాష్ట్రానికి పట్టిన శని అని జీవన్‌ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ శనిని మరో మూడు నెలల్లో తెలంగాణ ప్రజలు వదిలించుకుంటారని వెల్లడించారు. కేసీఆర్‌ ఏ వర్గాల వారిని ఎలా చూస్తున్నారో ప్రజలకు అర్దమైయిందని, ప్రజలే కేసీఆర్‌కు బుద్ది చెప్పుతారని జీవన్‌ రెడ్డి పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు