BRS: పక్క రాష్ట్రం గురించి మాకెందుకు అంటే.. ఇక జాతీయ పార్టీగా బీఆర్ఎస్ పెట్టడం ఎందుకు..?

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు గురించి బీఆర్ఎస్ కీలక నేతలు స్పందించిన తీరు విమర్శలకు దారి తీస్తోంది. ఇది కేవలం రెండు రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న గొడవ అని.. దాంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. అలాగే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కూడా పక్క రాష్ట్రం సమస్య గురించి తాము మాట్లాడమని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక సీఎం కేసీఆర్ కూడా ఈ పరిణామాలపై మౌనంగానే ఉన్నారు. దీంతో రాజకీయ విశ్లేషకులు, ప్రతిపక్ష నాయకులు బీఆర్ఎస్‌ తీరుపై విమర్శలు చేస్తున్నారు.

New Update
BRS: పక్క రాష్ట్రం గురించి మాకెందుకు అంటే.. ఇక జాతీయ పార్టీగా బీఆర్ఎస్ పెట్టడం ఎందుకు..?

BRS: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు గురించి బీఆర్ఎస్ కీలక నేతలు స్పందించిన తీరు విమర్శలకు దారి తీస్తోంది. ఇది కేవలం రెండు రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న గొడవ అని.. దాంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. అలాగే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కూడా పక్క రాష్ట్రం సమస్య గురించి తాము మాట్లాడమని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక సీఎం కేసీఆర్ కూడా ఈ పరిణామాలపై మౌనంగానే ఉన్నారు. దీంతో రాజకీయ విశ్లేషకులు, ప్రతిపక్ష నాయకులు బీఆర్ఎస్‌ తీరుపై విమర్శలు చేస్తున్నారు.

ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ నియామకం..

గతేడాది వరకు  ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీగా మార్చి భారతీయ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అనే పేరును పెట్టారు గులాబీ బాస్. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర గపోషిస్తామని కేసీఆర్ చాలా సార్లు ప్రకటించారు. ఇప్పటికే మహారాష్ట్రలో అనేక సార్లు ప్రకటించారు. అలాగే ఏపీలో కూడా తమ కార్యకలాపాలు కొనసాగిస్తాని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో కూడా పోటీ చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా గుంటూరులో పార్టీ కార్యాలయం కూడా ప్రారంభించడంతో పాటుగా రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను నియమించారు. జాతీయ పార్టీగా అన్ని రాష్ట్రాల్లో పోటీ చేయాలని భావిస్తున్న బీఆర్ఎస్ పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రంలో జరిగిన చంద్రబాబు అరెస్టును ఖండించకపోవడం ఏంటని తెలంగాణ టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.

కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్న..

పక్క రాష్ట్రం గురించి మాకెందుకు అన్నప్పుడు జాతీయ పార్టీ పెట్టడం ఇంకెందుకని మండిపడుతున్నారు. ఇప్పటికే జాతీయ పార్టీలుగా ఉన్న టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సమాజ్ వాదీ అధ్యక్షుడు ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా వంటి నేతలు స్పందించినప్పుడు కేసీఆర్ మాత్రం ఎందుకు స్పందించరని నిలదీస్తున్నారు. మొన్నటి వరకు బీజేపీతో పాటు ప్రధాని మోదీపై ఒంటికాలుతో విరుచుకుపడిన గులాబీ బాస్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నిస్తున్నారు.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో హడావిడి..

మొన్నటి వరకు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో బీఆర్ఎస్ చేసిన హడావిడిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. తెలంగాణ పార్టీగా ఆంధ్రా ప్రజల్లో ఉన్న అనుమానాలను చెరిపేసేందుకు.. అక్కడ సత్తా చాటేందుకు విశాఖ ఉక్కు అంశాన్ని బీఆర్ఎస్ వాడుకోవాలని చూసింది కదా అని చెబుతున్నారు. ప్రైవేటీకరణ బిడ్ విషయంలోనూ పాల్గొనాలని ప్రయత్నించిన సంగతి తెలిసిందే. సింగరేణి సంస్థ ద్వారా బిడ్ వేసి దక్కించుకోవాలని భావించింది. అయితే ఇప్పుడు మాత్రం ఏపీలో జరుగుతున్న కక్షపూరిత రాజకీయ పరిణామాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు