RSP: 90 ఏళ్లుగా బీసీ కులగణన ఎందుకు జరగడం లేదు: ప్రవీణ్ కుమార్ ధ్వజం

ఏ కులానికైనా..వెనుకబాటుతనం, ఆర్థిక స్థితిగతులు,నిరుద్యోగం, రాజకీయ ప్రాతినిధ్యం తెలుసుకోవాలనుకుంటే జనాభా లెక్కలే ఆధారమని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్పీ అన్నారు. అలాంటిది దేశంలో 90 ఏళ్లుగా బీసీ కులాల జనాభా లెక్కలు ఎందుకు లేవని ఆయన నిలదీశారు. ఆధిపత్య పాలకులు ఇచ్చే చిన్నా చితకా రాజకీయ పదవుల కోసం ఆశ పడుతూ.. ఎన్నాళ్లు వేచి చూసేదని ఆర్ఎస్పీ ప్రశ్నించారు.

New Update
RSP-BRS: నేడు బీఆర్‌ఎస్‌ లోకి ఆర్‌ఎస్పీ!

RSP: ఏ కులానికైనా..వెనుకబాటుతనం, ఆర్థిక స్థితిగతులు,నిరుద్యోగం, రాజకీయ ప్రాతినిధ్యం తెలుసుకోవాలనుకుంటే జనాభా లెక్కలే ఆధారమని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్పీ అన్నారు. అలాంటిది దేశంలో 90 ఏళ్లుగా బీసీ కులాల జనాభా లెక్కలు ఎందుకు లేవని ఆయన నిలదీశారు. దీనికి సంబంధించి ఆయన ఎక్స్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు.

కాగా, 1931 లో బ్రిటీష్ పాలనలో కులాల వారీగా పాపులేషన్ గణన జరిగిందని.. 77 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో బీసీ కులగణన ఇప్పటికీ ఎందుకు జరగలేదని ఆయన ప్రశ్నించారు. ఇక కులగణన చేయకుండా కుట్రలు చేస్తుంది ఎవరని ఆర్ఎస్పీ నిలదీశారు. బీసీ ప్రధాన మంత్రిగా చెప్పుకునే నరేంద్ర మోడీ ఎందుకు కులగణన చేయడం లేదని అడిగారు.

ఇక జనాభాలో పిడికెడు మంది లేని ఆధిపత్య కులాల దొరల చేతుల్లో రాజకీయ అధికారం పెట్టి ఇంకెంత కాలం మోసపోదామని ఆయన ప్రశ్నించారు. 2014 లో తెలంగాణలో కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వేల్లో బీసీల జనాభా ఎంత ఉంది..? ఆ నివేదికను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదని ఆర్ ఎస్పీ నిలదీశారు.

ఈ దేశంలో అణగారిన వర్గాలకు ఆత్మగౌరవాన్ని,అధికారాన్ని ఇచ్చే ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమేనని ఆయన పిలుపునిచ్చారు. ఇక ఆధిపత్య పాలకులు ఇచ్చే చిన్నా చితకా రాజకీయ పదవుల కోసం ఆశ పడుతూ.. ఎన్నాళ్లు వేచి చూసేదని ఆర్ఎస్పీ ప్రశ్నించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు