సీఎమ్ సిద్ధరామయ్యపై చిరాకుపడిన సీనియర్ సిటిజన్..ఎందుకంటే..!?

కర్ణాటక ముఖ్యమంత్రి,సీనియర్ కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యకు ఓ చేదు అనుభవం ఎదురైంది. సిద్ధరామయ్య ఇంటికి సమీపంలో నివసించే ఓ సీనియరస్ సిటిజన్..సీఎమ్ పై అందరూ చూస్తుండగానే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. మీ ఇంటికి వచ్చే అతిథుల వల్ల తమ వాహనాల రాకపొకలకు అంతరాయం కలుగుతోందని తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.దాంతో ఇంటి దగ్గర ఉండే సెక్యూరిటీ సిబ్బందిని పిలిచి ఆ పెద్దాయన పార్కింగ్‌ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.ఇకపై మీకు పార్కింగ్‌ సమస్య ఉండదని, మా సెక్యూరిటీ సిబ్బంది మీ సమస్యను పరిష్కరిస్తారని సీఎం సిద్ధరామయ్య ఆ వృద్ధుడికి నచ్చజెప్పారు. అనంతరం సీఎం కాన్వాయ్‌ అక్కడి నుంచి వెళ్లిపోయింది.

New Update
సీఎమ్ సిద్ధరామయ్యపై చిరాకుపడిన సీనియర్ సిటిజన్..ఎందుకంటే..!?

కర్ణాటక ముఖ్యమంత్రి,సీనియర్ కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యకు ఓ చేదు అనుభవం ఎదురైంది. సిద్ధరామయ్య ఇంటికి సమీపంలో నివసించే ఓ సీనియరస్ సిటిజన్..సీఎమ్ పై అందరూ చూస్తుండగానే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. మీ ఇంటికి వచ్చే అతిథుల వల్ల తమ వాహనాల రాకపొకలకు అంతరాయం కలుగుతోందని తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.

publive-image
ఎన్నాళ్ల నుంచో అణచుకుంటున్న ఆగ్రహం ఆరోజు కట్టలు తెంచుకుంది. సీఎమ్ అయితే మాత్రం..అతను దిగొచ్చాడా...ఆయన వల్ల ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకోవద్దా..!? ఏదైతే అదైంది అడాగాల్సిన నాలుగు ముక్కలు అడిగెద్దాం అనుకున్నాడో బాధ్యగల పెద్దాయన. అనుకున్నదే తడవుగా సీఎమ్ సిద్ధరామయ్య కాన్వాయ్ కి అడ్డుపడ్డాడు

ఈ ఘటన సిద్ధరామయ్య ఇంటి ముందు గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. సిద్ధరామయ్య తన ఇంటి నుంచి బయలుదేరుతుండగా పొరుగింట్లో ఉండే నరోత్తమ్‌ అనే వృద్ధుడు సిద్ధరామయ్య కాన్వాయ్ మీదకు దూసుకు వచ్చాడు.

ఇంతలో సీఎం సెక్యూరిటీ సిబ్బంది ఆయనను పక్కకు లాగుతుండగా సిద్ధరామయ్య జోక్యం చేసుకుని వారిని వారించారు. దాంతో భద్రతా సిబ్బంది వృద్ధుడిని సిద్ధరామయ్య దగ్గరికి అనుమతించారు. ఈ సందర్భంగా రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగి అయిన నరోత్తమ్‌ సిద్ధరామయ్యను గట్టిగా నిలదీశారు.

publive-image
‘నిత్యం మీ ఇంటికి వచ్చే అతిథుల వల్ల మేం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం’ అని మండిపడ్డారు.‘మీ ఇంటికి వచ్చే అతిథులు వీధి నిండా వాహనాలను పార్క్‌ చేస్తున్నారు. దాంతో మా వాహనాలను పార్క్‌ చేయాలన్నా, పార్క్‌ చేసిన వాహనాలను బయటికి తీయాలన్నా మేం చాలా అవస్థలు పడుతున్నాం. గత ఐదేండ్లుగా ఎందుకు మాకీ నరక యాతన..?’ అని నరోత్తమ్‌ ప్రశ్నించారు.

దాంతో ఇంటి దగ్గర ఉండే సెక్యూరిటీ సిబ్బందిని పిలిచి ఆ పెద్దాయన పార్కింగ్‌ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.ఇకపై మీకు పార్కింగ్‌ సమస్య ఉండదని, మా సెక్యూరిటీ సిబ్బంది మీ సమస్యను పరిష్కరిస్తారని సీఎం సిద్ధరామయ్య ఆ వృద్ధుడికి నచ్చజెప్పారు. అనంతరం సీఎం కాన్వాయ్‌ అక్కడి నుంచి వెళ్లిపోయింది.

కాగా, సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినప్పటికీ ఇంకా తన గతంలో కేటాయించిన ప్రతిపక్ష నేత బంగ్లాలోనే ఉంటున్నారు. వచ్చే ఆగష్ట్ కు సిద్ధరామయ్య కర్ణాటక ప్రభుత్వ “సీఎమ్ అధికారిక” నివాసానికి మారనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు