Ugadi 2024: క్రోధి నామ సంవత్సరం అంటే ఏంటి? ఈ ఏడాది ఎలా ఉండబోతోంది?

ఈ సంవత్సరం ఉగాది నుంచి క్రోధి నామ సంవత్సరం ప్రారంభం కాబోతోంది. అసలు ఈ క్రోధి నామ సంవత్సరం అంటే ఏమిటి?దాని అర్థం ఏంటి?ఈ ఏడాది ఎలాంటి పరిస్థితులు ఎదురువుతాయి. పండితులు ఏం చెబుతున్నారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

New Update
Ugadi 2024: క్రోధి నామ సంవత్సరం అంటే ఏంటి? ఈ ఏడాది ఎలా ఉండబోతోంది?

Ugadi 2024: ఈ ఏడాది ఉగాది ఏప్రిల్ 9వ తేదీన చైత్ర మాస శుక్లపక్ష పాడ్యమి మంగళవారం రోజున ప్రజలు ఉగాది పండగను జరుపుకోనున్నారు. ఈ ఏడాది క్రోధి నామ సంవత్సరం. శ్రీ క్రోధి నామ సంవత్సరంతో కలియుగం ప్రారంభమై 5,125 ఏళ్లు అయ్యాయని పండితులు చెబుతున్నారు. శ్రీ క్రోధినామ సంవత్సరం అంటే క్రోధమును కలిగించేదని వివరిస్తున్నారు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ప్రజలు కోపం, ఆవేశముతో వ్యహరిస్తారని అంటున్నారు. కుటుంబ సభ్యుల మధ్య క్రోధములు వంటివి కలగుతాయని.. దేశంలో రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు, క్రోధములు కలగడం, దేశాల మధ్య ఆగ్రహావేశాలు, యుద్ధ వాతావరణం వంటివి కలగడం వంటి సూచలు ఎక్కువగా ఉన్నాయని సిద్ధాంతులు చెబుతున్నారు. శాలివాహన చక్రవర్తి చైత్ర శుక్ల పాడ్యమినాడు పట్టాభిషిక్తుడై తన శౌర్య పరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లిన కారణంతోనే ఆ యోధాగ్రణి స్మ్రుత్యర్థం ఉగాది ఆచరిస్తారని చారిత్రక వ్రుత్తాంతం చెబుతోంది. శిశిర రుతువులో ఆకురాలుతుంది. శిశిరం తర్వాత వసంతం వస్తుంది. చెట్లు చిగురిస్తాయి. ప్రకృతి అంతా కూడా శోభాయమానంగా మారుతుంది. కోయిలలు కుహు కుహూ అంటూ గానమెత్తుతాయి.

ఉగాది అంటే ఏమిటి?
ఉగ అంటే నక్షత్ర గమనం లేదా జన్మ, ఆయుష్షు అని అర్థాలు ఉన్నాయి. వీటికి ఆది ఉగాది. ప్రపంచంలోని జనుల ఆయుష్షుకు మొదటిరోజు ఉగాది. ఉగాస్య ఆది అనేదే ఉగాది. మరోవిధంగా చెప్పాలంటే యుగం అనగా రెండు లేదా జంట. ఉత్తరాయణ, దక్షిణాయణాల ద్వయ సంయుతం యుగం కాగా.. ఆ యుగానికి ఆది ఉగాది అయిందని పండితులు చెబుతున్నారు. అదే సంవత్సరాది ఉగాది, వసంతాలకు గల అవినాభావ సంబంధం, సూర్యునికి సకల రుతువులకు ప్రాత:సాయం కాలాది త్రికాలములకు ఉసాదేవతయో మాతృ స్వరూపం. భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడు అనగా ఉగాది రోజున సృష్టి జరిగినట్లు పురాణాలు చెప్తున్నాయని పండితులు వివరిస్తున్నారు. వేదాలను హరించిన సోమకుని వధించి మత్స్యావతారధారియైన విష్ణువు వేదాలను బ్రహ్మ కప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్ధం “ఉగాది” ఆచరణలోకి వచ్చెనని పురాణ ప్రతీతి. కాగా చైత్ర శుక్ల పాడ్యమినాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు. కాబట్టి సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపుకుంటారని పండితులు చెబుతున్నారు.

ఉగాది పచ్చడి విశిష్టత:
షడ్రుచుల సమ్మేళనం : తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ఎంతో ప్రత్యేకమైంది. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను ఒకే విధంగా స్వీకరించాలని సూచిస్తూ ఉగాది పచ్చడి తప్పనిసరిగా చేసుకుంటారు. ఈ పచ్చడి తయారీకి చెరకు, అరటిపళ్ళు, మామిడికాయలు, వేపపువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలైనవన్నీ వాడుతుంటారు. ఇంకా పంచాంగ శ్రవణం, మిత్ర దర్శనము, గోపూజ, ఏరువాక తదితర ఆచారాలు పాటిస్తారని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.

మొత్తం ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి?
మొత్తం 60 సంవత్సరాలు ఉన్నాయి. ఈ సంవత్సరము ప్రభవతో మొదలై అక్షయతో ముగుస్తుంది. 60 పూర్తయిన తర్వాత, సంవత్సరం ప్రారంభం నుండి మళ్లీ ప్రారంభమవుతుంది. ఒక్కో పేరు వెనుక 60 ఏళ్ల కథ ఉంది. మొదటి సీజన్ వసంతకాలం. మొదటి మాసం చైత్ర మాసం. హిందువులకు కొత్త సంవత్సరం జనవరి 1 నుండి కాకుండా ఉగాది నుండి ప్రారంభమవుతుంది. ఉగాది పండుగను వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో జరుపుకుంటారు. మహారాష్ట్రలో గుడి పడ్వా జరుపుకుంటారు. బెంగాలీలు ఉగాదిని పొయిలా భైశాఖ్‌గా, సిక్కులు వైశాఖిగా, మలయాళీలు విషుగా జరుపుకుంటారు.

ఇది కూడా చదవండి: రూ.5వేల స్మార్ట్ వాచ్..రూ.999కే..ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు..వెంటనే కొనేయండి..!

Advertisment
Advertisment
తాజా కథనాలు