నేటికి జరుగుతున్న బాల్యవివాహాలు..చిన్న వయసులోనే అనారోగ్యానికి గురవుతున్న మహిళలు!

బాలికలకు చిన్న వయసులో చాలా ప్రాంతాల్లో పెళ్లి చేసి పంపిస్తున్న తల్లి దండ్రులు ఇప్పటికీ కూడా ఉన్నారు. చిన్న వయసులో పెళ్లిళ్లు జరగటం వల్ల వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం!

New Update
నేటికి జరుగుతున్న బాల్యవివాహాలు..చిన్న వయసులోనే అనారోగ్యానికి గురవుతున్న మహిళలు!

తెలిసీ తెలియని వయసు వారిది. అప్పుడే జీవితం అంటే ఏమిటి..? తల్లిదండ్రులు పడుతున్న బాధలు, వారు కష్టాన్ని అధికమించే ఎత్తుగడులు చిన్న చిన్నగా తెలుసుకొంటూ ఉంటారు. యుక్త వయసులో ప్రేమ అనే వ్యామోహనికి గురై చిన్న వయసులో పెళ్లిళ్లు చేసుకొని, గర్భం దాల్చిన సందర్భాలు ఎన్నో చూసి ఉంటాం. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అధికమించలేక జీవితాంతం అనారోగ్య పరిస్థితుల సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది.

బాల్య వివాహాలు అనేవి పూర్వం, గ్రామాల్లో విరివిగా ఘటనలు కనిపించేవి. నాటి నుండి అలాంటి వివాహాలు చేసుకొని భవిష్యత్తులో పడుతున్న లోపాలను గమనించి, వీటిని అరికట్టే దిశగా ఉన్నత అధికారులు అనేక ప్రణాళికలు రచించారు. వీటి పై మొగ్గు చూపే జంటలపై కేసులు పెట్టినా ఎక్కడో ఒక్క చోట ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతునే ఉన్నాయి. ఇదిగమనించిన జిల్లా అధికారులు వీటిని పూర్తి స్థాయిలో అధికమించాలి అంటే కచ్చితంగా అవగాహన తప్పనిసరి అవసరం. కచ్చితంగా 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలు మాత్రమే పెళ్లిళ్లు చేసుకోవడానికి అర్హులు. ఇంట్లో పెళ్లి చేసుకోమని తల్లిదండ్రులు బలవంతం పెట్టినా,లేదా ఆడ పిల్ల ఇష్టపడి పెళ్లి చేసుకొన్నా కచ్చితంగా బాల్య వివాహాల చట్టం కింద శిక్షకు అర్హులు. కొంత మంది వృద్ధులు సమాజంలో నేటికి మూడ నమ్మకాలను నమ్ముతూ భావి తరాలకు ఇబ్బంది వాతావరణం సృష్టిస్తున్నారన్నారు.

మేము చనిపోయే లోపు తమ వారసుల పెళ్లి చూడాలనే కోర్కెను తీర్చడానికి కూడా బాల్య వివాహాలు జరిపించే వారన్నారు. యుక్త వయసు రాకుండా పెళ్లి చేసుకొంటే ఆరోగ్య సమస్యలు జీవితాంతం వెంటాడుతాయి. చిన్న వయసులో గర్భం దాల్చితే పుట్టబోయే బిడ్డ లోపాలతో పుట్టడం, అంగవైకల్యంగా పుట్టడం ఇలా అనేక సమస్యలకు దారితీస్తాయి.
Advertisment
Advertisment
తాజా కథనాలు