భారత్‌తో వన్డే సిరీస్‌కు విండీస్ జట్టులోకి హార్డ్ హిట్టర్ రీఎంట్రీ టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఘోరంగా విఫలమైన విండీస్ జట్టు వన్డే సిరీస్ కోసం సిద్ధం అవుతోంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో ధాటిగా ఆడే విండీస్ ప్లేయర్లు రోహిత్ సేనకు షాక్ ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం నుంచి ప్రారంభంకానున్న వన్డే సిరీస్‌కు పవర్ హిట్టర్లను జట్టులోకి తీసుకువచ్చారు. By BalaMurali Krishna 25 Jul 2023 in Scrolling స్పోర్ట్స్ New Update షేర్ చేయండి జట్టులోకి హెట్మెయిర్, థామస్.. వెస్టిండీస్ వన్డే జట్టులోకి పవర్ హిట్టర్లు రీఎంట్రీ ఇచ్చారు. ఈనెల 27 నుంచి టీమిండియాతో ప్రారంభకానున్న వన్డే సిరీస్ కోసం విండీస్ క్రికెట్ బోర్డు 15మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టులోకి రెండు, మూడేళ్ల తరువాత హార్డ్ హిట్టర్ షిమ్రాన్ హెట్మెయిర్, ఫాస్ట్ బౌలర్ ఒషానే థామస్ ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఐపీఎల్లో అదరగొట్టిన కేల్ మేయర్స్‌కు కూడా అవకాశం దక్కింది. అయితే వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో ఘోరంగా విఫలమైన మాజీ కెప్టెన్ నికోలస్ పూరన్‌ను జట్టు నుంచి తప్పించారు సెలెక్టర్లు. వన్డే జట్టుకు షై హోప్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, రోవ్‌మన్ పావెల్ వైస్ కెప్టెన్‌గా ఉండనున్నాడు. వీరి రాకతో జట్టు కూర్పు బలం.. హెట్మెయిర్, ఒషానే థామస్‌లను తిరిగి విండీస్ జట్టులోకి స్వాగతిస్తున్నామని చీఫ్ సెలెక్టర్ డెస్మాండ్ హేన్స్ తెలిపారు. అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉండటంతో పాటు విజయవంతమైన ఆటగాళ్లు కావడంతో వీరిని టీమ్‌లోకి తీసుకున్నామని పేర్కొన్నారు. వీరిద్దరి రాకతో జట్టు కూర్పు బలంగా ఉందని వెల్లడించారు. బిగ్ హిట్టర్‌గా పిలవబడే హెట్మేయర్ తన చివరి వన్డే మ్యాచ్ 2021 జులైలో ఆడాడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హెట్మేయర్ గత సీజన్లో 300 పరుగులతో రాణించాడు. మరోవైపు టెస్టు సిరీస్‌లో రాణించిన అలిక్ అథనేజ్‌కు వన్డే సిరీస్‌లో కూడా చోటుదక్కింది. జులై 27, జులై 29, ఆగస్టు 1వ తేదీల్లో మూడు వన్డేలు జరగనున్నాయి. అనామక జట్టుగా మారిన భీకర జట్టు.. ప్రపంచకప్ క్వాలిఫై టోర్నీలో ఘోరంగా విఫలమైన ఆ జట్టు పసికూన లాంటి జట్లు చేతిలో కూడా ఓడిపోయింది. దీంతో ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించలేదు. వరల్డ్‌కప్ టోర్నీ ప్రారంభమైన నాటి నుంచి తొలిసారి మెగా ఈవెంట్‌కు అర్హత సాధించలేకపోయింది. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన కరేబియన్ జట్టు నేడు అనామక జట్టుగా మిగిలిపోయింది. దీంతో ఆ జట్టుకు మళ్లీ పునర్ వైభవం తీసుకురావాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. వెస్టిండీస్ వన్డే జట్టు: షై హోప్(కెప్టెన్), రోవ్‌మన్ పావెల్(వైస్ కెప్టెన్), అలిక్ అథనేజ్, యానిక్ కారియ, కేసీ కార్టి, డొమినిక్ డ్రేక్స్, షిమ్రాన్ హెట్మెయిర్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, మోతీ, సీలెస్, రొమారియో షెపర్డ్, కెవిన్ సింక్లెయిర్, ఒషానే థామస్. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి