TS Weather : చల్లబడిన వాతావరణం..మరికొన్ని గంటల్లో ఈ జిల్లాల్లో వర్షాలు..! తెలంగాణలోని పలు జిల్లాల్లో వాతావరణం కాస్త చల్లబడింది.ఇవాళ మధ్యాహ్నం వరకు ఎండ వేడిమి ఎక్కువగానే ఉనప్పటికీ..సాయంత్రం చల్లబడింది. ఆయా జిల్లా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అటు ఏపీకి కూడా వర్షసూచన ఇచ్చింది ఐఎండీ. By Bhoomi 19 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి TS Weather : గత కొన్ని రోజులుగా నిప్పులు కొలిమిలా మారిన తెలంగాణ శుక్రవారం మధ్యాహ్నం తర్వాత వాతావరణం కాస్త చల్లబడింది. ఆయా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఎక్కువగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత వాతావరణం చల్లబడింది. ఆసిఫాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, జనగాం, భూపాలపల్లి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మూడు , నాలుగు గంటల్లో ఈ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఐఎండీ అంచనా వేసింది. ఇక తెలంగాణ ప్రాంతంలో శుక్రవారం నుంచి ఏప్రిల్ 25వ తేదీ వరకు కూడా మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రెండు మూడు రోజులు మళ్లీ ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇకఅటు ఏపీలోనూ ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. ఉత్తరకోస్తాతోపాటు దక్షిణకోస్తా ప్రాంతంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇది కూడా చదవండి: చోటుతో రాహుల్ గాంధీ సరదా.. ఫన్నీ వీడియో వైరల్! #ts-weather-update #ts-weather మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి