వెస్టీండీస్ పై అలవోకగా గెలిచిన ఇంగ్లాండ్ జట్టు!

ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ ఘోర పరాజయం పాలైంది.మ్యాచ్ అనంతరం వెస్టిండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ గురించి మాట్లాడాడు.అతడు ప్రతిసారీ తమ జట్టుపై అద్భుతంగా రాణిస్తున్నాడని ప్రశంసలు కురిపించాడు.సాల్ట్ ను అడ్డుకోవటంలో మా బౌలర్లు విఫలమైయారని అన్నాడు.

New Update
వెస్టీండీస్ పై అలవోకగా గెలిచిన ఇంగ్లాండ్ జట్టు!

టీ20 ప్రపంచకప్ సిరీస్‌లో సూపర్ 8 రౌండ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌తో వెస్టిండీస్ ఆడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. చార్లెస్ అత్యధికంగా 38 పరుగులు చేయగా, పావెల్, పూరన్ తలా 36 పరుగులు జోడించారు.అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ జట్టు 17.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ 47 బంతుల్లో 5 సిక్సర్లు, 7 ఫోర్లతో 87 పరుగులు చేశాడు. అలాగే, జానీ బెయిర్‌స్టో 26 బంతుల్లో 48 పరుగులు చేశాడు.

దీంతో వెస్టిండీస్ జట్టు సెమీఫైనల్ కల నెరవేరుతుందా లేదా అనే సందేహం నెలకొంది. ఈ ఓటమిపై వెస్టిండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ మాట్లాడుతూ.. బ్యాటింగ్‌లో మొత్తంగా 15 నుంచి 20 పరుగులు తక్కువ చేశాం. బౌలింగ్‌లో జట్టు బౌలర్లు బాగానే ప్రయత్నించారు.బ్యాటింగ్ చేస్తున్న సమయంలో చివరి 5 ఓవర్లలో అదనపు దూకుడుతో ఆడి మరిన్ని పరుగులు జోడించే అవకాశాన్ని కోల్పోయాం. అందుకు ఇంగ్లండ్ బౌలింగ్‌కే క్రెడిట్ ఇవ్వాలి. మైదానంలో తమ ప్రణాళికను చక్కగా అమలు చేశారు. బ్రెండన్ కింగ్ గాయం కాస్త ఇబ్బందిని కలిగించింది. అయితే తర్వాతి మ్యాచ్‌లో కచ్చితంగా అతడు రాణించగలదని అనుకుంటున్నాను.

ఫిల్ సాల్ట్  ప్రతిసారీ ప్రతిసారీ మనపై అద్భుతంగా రాణిస్తున్నాడని.. మేము అతనికి వ్యతిరేకంగా మా ప్రణాళికలను అమలు చేయలేకపోయామని పావెల్ పేర్కొన్నాడు. మా తదుపరి మ్యాచ్‌ల్లో మెరుగైన క్రికెట్ ఆడతామన్న నమ్మకం ఉందని చెప్పాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు