AP: ప్రభుత్వాలు మారుతున్నా.. తీరని నీటి కష్టాలు.. ప్రాణాలకు తెగిస్తేనే మంచి నీళ్లు!

ఏలూరు జిల్లా కొల్లేరు లంక గ్రామాల్లో దాహం కేకలు వినిపిస్తున్నాయి. దశాబ్దాల కాలంగా మంచినీటి సదుపాయం లేక లంక గ్రామాల ప్రజలు అల్లాడిపోతున్నారు. జంగంపాడు గ్రామస్తులు ఇప్పటికీ బిందెడు నీళ్ల కోసం బండెడు కష్టాలు పడుతోన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

New Update
AP: ప్రభుత్వాలు మారుతున్నా.. తీరని నీటి కష్టాలు.. ప్రాణాలకు తెగిస్తేనే మంచి నీళ్లు!

West Godavari: ఏలూరు జిల్లా కొల్లేరు లంక గ్రామాల్లో దాహం కేకలు వినిపిస్తున్నాయి. దశాబ్దాల కాలంగా కనీసం మంచినీటి సదుపాయం లేక పలు లంక గ్రామాల ప్రజలు అల్లాడిపోతున్నారు. కొల్లేరు లంక గ్రామాల తాగునీటి సమస్యపై RTV ప్రత్యేక కథనం చెబుతోంది. కైకలూరు మండలం కొట్టాడ పంచాయతీ పరిధిలోని జంగంపాడు గ్రామంలో RTV గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తోంది.

చుక్క నీరు కోసం..

ఇప్పటికీ బిందెడు నీళ్ల కోసం బండెడు కష్టాలు పడుతోన్నారు జంగంపాడు గ్రామస్తులు. గొంతు తడుపుకోవాలంటే ప్రాణాలకు తెగించి నాటు పడవ ద్వారా ఉప్పుటేరు వాగు దాటాల్సిందే. వాగు అంతా గుర్రపుడెక్కతో ప్రమాదకరంగా ఉన్నా చుక్క నీరు కోసం తిప్పలు తప్పడం లేదు. కేవలం మంచి నీటి కోసమే కాదు.. ఏ చిన్న అవసరం ఉన్నా నాటు పడవే ఆధారం. వాగుకు అటుపక్క ఉన్న దుంపగడప పంచాయతీకి వెళ్ళాలి అంటే చుట్టూ 25 కిలోమీటర్లు ఉండటంతో ప్రతీ అవసరానికి నాటు పడవ ద్వారానే వాగు దాటి దుంపగడప పంచాయతీకు వెళ్తోన్నారు జంగంపాడు వాసులు.

Also Read: హిజ్రాల మధ్య గ్రూప్ వార్.. బర్త్ డే సెలబ్రేషన్స్ జరుగుతుండగా కత్తులు, రాడ్లతో ఇంట్లోకి చొరబడి..

మారని గ్రామ పరిస్థితి..

నాటు పడవలో వెళ్లి క్షేత్రస్థాయిలో గ్రామస్తుల ఇబ్బందులు తెలుసుకున్నారు RTV ప్రతినిధి. ఒకప్పుడు ఉప్పుటేరు నీరే తాగేవాళ్ళమని కానీ ఇప్పుడు కొల్లేరులో అక్రమ చెరువుల తవ్వకాలు, పెరుగుతోన్న కాలుష్యం కారణంగా ఉప్పుటేరు నీరు తాగే పరిస్థితి లేదని జంగంపాడు గ్రామస్తులు వాపోతోన్నారు. ప్రభుత్వాలు మారుతోన్న తమ గ్రామ పరిస్థితి మారట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మమ్మల్ని ఆదుకోండి..

ఇక్కడ వంతెన నిర్మిస్తామని ఎన్నికలు వచ్చిన ప్రతీసారీ నాయకులు హామీలు ఇచ్చినా.. ఎక్కడా అమలు జరిగట్లేదని చెప్తోన్నారు. వంతెన నిర్మాణం, మంచినీటి సదుపాయం కల్పిస్తే తమ జీవన ప్రమాణాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దృష్టి పెట్టి తమని ఈ కష్టాల నుంచి గట్టెకించాలని గ్రామస్తులు కోరుతోన్నారు. కొల్లేరులో ఇలాంటి గ్రామాలు చాలా ఉన్నా.. తమ జంగంపాడు గ్రామం పరిస్థితి మరీ అద్వాన్నంగా ఉందని వాపోతున్నారు. తమని ఆదుకోవాలని RTV ద్వారా జంగంపాడు గ్రామస్తులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు