వార్ రూం ఫైట్..! ఈ కొత్త స్ట్రాటజీ టీబీజేపీకి వర్కౌట్ అయ్యేనా?

రానున్న ఎన్నికలే టార్గెట్ గా తెలంగాణలో అధికార, ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి. ముచ్చటగా.. మూడోసారి కూడా గద్దెనెక్కాలని కారు స్పీడ్ పెంచితే.. ప్రధాన ప్రతిపక్షాలు కారు టైర్ ను పంచర్ చేసి పరుగులు పెట్టాలని స్కెచ్ వేస్తున్నాయి. ఇక మళ్లీ గాడిలోకి పడడానికి టీబీజేపీ కొత్త.. కొత్త.. స్ట్రాటజీలతో దూకుడు పెంచే పనిలో పడింది.కర్ణాటక ఓటమితో దక్షిణాది తలుపులు మూసుకుపోవడంతో.. తెలంగాణను సౌత్ గేట్ వేగా బీజేపీ ఫిక్స్ చేసుకుంది. మరి ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి.

New Update
వార్ రూం ఫైట్..! ఈ కొత్త స్ట్రాటజీ టీబీజేపీకి వర్కౌట్ అయ్యేనా?

రానున్న ఎన్నికలే టార్గెట్ గా తెలంగాణలో అధికార, ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి. ముచ్చటగా.. మూడోసారి కూడా గద్దెనెక్కాలని కారు స్పీడ్ పెంచితే.. ప్రధాన ప్రతిపక్షాలు కారు టైర్ ను పంచర్ చేసి పరుగులు పెట్టాలని స్కెచ్ వేస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ నెలకొంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ కు అనూహ్యంగా ఊపు వస్తే..టీబీజేపీ కాస్త వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. అయితే మళ్లీ గాడిలోకి పడడానికి టీబీజేపీ కొత్త.. కొత్త.. స్ట్రాటజీలతో దూకుడు పెంచే పనిలో పడింది.

War room fight..! Will this new strategy work out for TBJP?

ఈ క్రమంలోనే సోషల్ మీడియాకు ఉన్న పవర్ ను దృష్టిలో పెట్టుకొని వార్ రూం ఫైట్ కు దిగుతోంది. కేసీఆర్ పాలన వైఫల్యాలపై సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేయడానికి ఈ వార్ రూంను వాడుకోవాలని చూస్తున్నారు కమలనాథులు. దీంతో బీజేపీ మెయిన్ ఆఫీసులో పోల్ వార్ రూం ను ఏర్పాటు చేశారు. దీనికి ఇన్ ఛార్జ్ గా బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జాఫర్ ఇస్లాంను నియమిస్తూ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే రఘునందన్ రావు, యోగానంద్ కు సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించారు. వీరితో పాటు సీనియర్ లీడర్, మాజీ ఎమ్మెల్యే నల్లు ఇంద్రసేనారెడ్డి, ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి సమన్వయ బాధ్యతలు ఇవ్వడం జరిగింది.

మీడియా స్ట్రాటజీ టీం..

పోల్ వార్ రూంతో కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్న బీజేపీ.. ప్రజలకు దగ్గరయ్యేందుకు మీడియా స్ట్రాటజీ టీంను కూడా ఏర్పాటు చేసింది. దీనికి ఇన్ ఛార్జ్ గా జాతీయ నేత శ్వేత శాలనిని నియమించారు. దీంతో బీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు బీజేపీ సిద్దం చేస్తున్న రంగంలో శ్వేత శాలిని కూడా జాయిన్ అయినట్లైంది. 2013-2014 గుజరాత్ ఎన్నికల్లో మోడీ కోసం ఆమె వ్యూహకర్తగా పనిచేశారు. బీహార్ కు చెందిన ఆమె ప్రెజెంట్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు సలహాదారుగా ఉన్నారు.

రంగంలోకి 22 ప్రత్యేక కమిటీలు..

పక్కా ప్రణాళికతో దూసుకెళ్లాలని భావిస్తున్న టీబీజేపీ ప్రత్యేక కమిటీలతో పార్టీని క్షేత్ర స్థాయిలో స్ట్రాంగ్ చేయాలని చూస్తోంది. దీని కోసం త్వరలోనే 22 కమిటీలను ఏర్పాటు చేయనుంది. మేనిఫెస్టో కమిటీ, మీడియా ప్రచార కమిటీ, పబ్లిక్ మీటింగ్స్ కమిటీ, చార్జ్ షీట్ కమిటీ, టాకింగ్ పాయింట్స్ కమిటీ, ఫీడ్ బ్యాక్ కమిటీ, స్టాటిస్టిక్స్ కమిటీలతో పాటు వేరే కో ఆర్డినేషన్ కమిటీలను ఏర్పాటు చేసే పనిలో మునిగింది టీబీజేపీ. ప్రతి రోజూ బీజేపీ ఆఫీస్ లో ఒక జాతీయ కార్యవర్గ సభ్యుడి మీడియా సమావేశం ఉండేలా..రానున్న వంద రోజులను ప్లాన్ చేస్తోంది.

మైనార్టీ ఓట్లే టార్గెట్ గా..

ఈ సారి ముస్లిం ఓటర్లను కూడా బీజేపీ టార్గెట్ చేస్తోంది. దీని కోసమే వార్ రూం ఇన్ చార్జ్ గా ముస్లిం వ్యక్తినే నియమించడం జరిగింది. నేషనల్ స్పోక్ పర్సన్, యూపీ రాజ్యసభ సభ్యుడు సయ్యద్ జాఫర్ ఇస్లాంకు వార్ రూమ్ బాధ్యతలు ఇచ్చారు. అయితే ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో ఎంఐఎంను టార్గెట్ పెట్టుకుంది టీబీజేపీ. ఎవరు ఏం చేసినా గ్రేటర్ లో హవా మాదే అన్న ఎంఐఎం ధీమాను తగ్గించడానికి ఈ సారి ఎలాగైనా అక్కడ పాగా వేయాలని చూస్తున్నారు కమలనాథులు. అయితే గత ఎన్నికల్లో ఆ పార్టీ 7 స్థానాలను కైవసం చేసుకోగా.. ఈ సారి మరిన్ని స్థానాలపై కన్నేసింది.

సౌత్ గేట్ వేగా తెలంగాణ ఫిక్స్..

కర్ణాటక ఓటమితో దక్షిణాది తలుపులు మూసుకుపోవడంతో.. తెలంగాణను సౌత్ గేట్ వేగా బీజేపీ ఫిక్స్ చేసుకుంది. ఇక్కడ విజయం సాధించి తమ సత్తా ఏంటో ప్రతిపక్షాలకు చూపించాలని ఛాలెంజ్ గా తీసుకుంది. దీంతో అమిత్ షా నేరుగా తెలంగాణ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే అమిత్ షా తెలంగాణలో తరుచుగా పర్యటిస్తారని పార్టీ శ్రేణులు వెల్లడించినప్పటికీ.. అది సాధ్యపడలేదు. అయితే పార్టీ అధ్యక్షుడి మార్పు తరువాత మొదటి సారి.. ఈ నెల 29న అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. పార్టీ వివిధ విభాగాలతో సమావేశమై ఆయన సంస్థాగత అంశాలపై సమీక్షించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ కు చెందిన ప్రముఖులు ఆయనతో భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే అదే రోజున ఖమ్మం సభ నిర్వహించాలని అనుకుంటే.. వర్షాల కారణంగా అది వాయిదా పడింది. మొత్తానికి ఈ వంద రోజుల్లో తెలంగాణలో పార్టీని గద్దెనెక్కించాలన్న ధృఢ సంకల్పంతో కమలనాథులున్నారు. మరి ఎంత వరకు ఈ స్ట్రాటజీలన్నీ వర్కౌట్ అవుతాయో వేచి చూడాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు